Site icon NTV Telugu

China: భారత దళాల ఉపసంహరణపై మాల్దీవులకు మద్దతు ఇస్తున్నట్లు చైనా ప్రకటన..

Maldives

Maldives

China: మాల్దీవుల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తాము మద్దతు ఇస్తున్నామని చైనా మంగళవారం ప్రకటించింది. ఫస్ట్ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది మాల్దీవులను విడిచిపెట్టింది. వారి స్థానంలో పౌరసిబ్బందిని నియమించింది. హెలికాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న భారత సైన్యం దేశాన్ని విడిచిపెట్టినట్లు మాల్దీవుల మీడియా సోమవారం తెలిపింది. మాల్దీవుల నుంచి భారత సిబ్బంది వైదొలగడంపై చైనాను మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ.. తమకు పూర్తి వివరాలు తెలియవని అన్నారు. ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో, స్వాతంత్రం ఆధారంగా అన్ని వైపులా స్నేహపూర్వక సహకారాన్ని కొనసాగించడంలో మాల్దీవులకు చైనా మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.

Read Also: India-China Border: సరిహద్దుల్లో పుట్టుకొస్తున్న చైనా గ్రామాలు.. భారత్-చైనా మధ్య ఘర్షణ తప్పదన్న యూఎస్ ఇంటెలిజెన్స్..

మాల్దీవుల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేఖ, చైనా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ‘ఇండియా అవుట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ముయిజ్జూ, భారత సైన్యం మాల్దీవులను విడిచి వెళ్లాలని ఆదేశించారు. మే 10 తర్వాత భారత సైనిక సిబ్బంది ఎవరూ కూడా పౌరదుస్తుల్లో తమ దేశంలో ఉండరాదని ప్రకటించారు. మాల్దీవుల నుంచి 90 మంది సైనిక సిబ్బంది ఉపసంహరణ జరుగుతోంది. ద్వీప దేశంలోని ప్రజలకు మానవతా సాయం అందించేందుకు డోర్నియర్ విమాన కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత సిబ్బంది ఆ దేశంలో ఉంది.

మరోవైపు చైనాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత భారత వ్యతిరేక గళాన్ని పెంచాడు ముయిజ్జూ. అతని ప్రభుత్వం చైనా స్పై షిప్ ఆ దేశంలో డాక్ కావడానికి అనుమతి ఇచ్చింది. తాజాగా చైనా-మాల్దీవుల మధ్య కుదిరిన సైనిక ఒప్పందం ప్రకారం ప్రాణాంతకం కానీ ఆయుధాలను చైనా ఉచితంగా సరఫరా చేస్తుంది. జనవరిలో చైనాను సందర్శించిన ముయిజ్జూ తమ దేశానికి చైనా టూరిస్టులను పంపాలని మరో 20 ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. చైనా మాల్దీవులకు 130 మిలియన్ డాలర్ల గ్రాంట్ ప్రకటించింది.

Exit mobile version