China reports 37 million Covid cases in a day: కరోనాకు జన్మస్థానం అయిన చైనాను ఉప్పెనలా కమ్మెస్తోంది మహమ్మారి. ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఏ దేశం చూడని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆ దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు విదేశీ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య, మరణాలపై చైనా స్పష్టత ఇవ్వడం లేదు. జీరో కోవిడ్ ఎత్తేసిన తర్వాత చైనా వ్యాప్తంగా భారీగా కేసులు పెరుగుతున్నాయి.
Read Also: CM Jagan Humanity: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్
ఇదిలా ఉంటే ఈ వారంలో ఒకే రోజు చైనాలో 3.7 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావచ్చు. డిసెంబర్ మొదటి 20 రోజల్లో చైనాలో దాదాపుగా 24.8 కోట్ల మంది అంటే దాదాపుగా జనాభాలో 18 శాతం మంది వైరస్ బారిన పడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అంతర్గత సమావేశాల్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు జనవరి నుంచి మార్చి మధ్యలో చైనాలో మూడు కరోనా వేవ్ లు దాడి చేస్తాయని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
‘‘జీరో కోవిడ్’’ పాలసీని అక్కడి ప్రభుత్వం ఎత్తేయడంతో ప్రజల్లో వేగం వ్యాప్తిచెందుతోంది కోవిడ్. ఒమిక్రాన్ బీఎఫ్ -7 సబ్ వేరియంట్ కారణంగా వేగం కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పాటు చైనీయుల తక్కువ వ్యాధినిరోధక శక్తి కూడా కేసులు, మరణాలకు కారణం అవుతోంది. రాజధాని బీజింగ్ తో సహా షాంఘై, షెన్జెన్, చాంగ్ కింగ్ నగరాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. పట్టణాలు, నగరాల నుంచి గ్రామాలకు కూడా వైరస్ విస్తరిస్తోంది. ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతోంది. పెరుగుతున్న మరణాల వల్ల శ్మశానాల్లో దహనం చేయడం కూడా కష్టం అవుతోంది.
