Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..

  • ఇరాన్‌లో కూలిన అమెరికా F-15పై కొత్త సంచలన నివేదిక.
  • చైనా తయారు చేసిన MANPADS క్షిపణితో దాడి జరిగి ఉండొచ్చని అనుమానం.
  • ఇరాన్‌కు రాడార్, సైనిక సాంకేతికత అందించిందన్న ఆరోపణలు.
  • ఘటనతో అమెరికా-చైనా సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలు.
F 15

F 15

Iran War: ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల ఇరాన్ అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చేసింది. చైనా తయారు చేసిన భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి(మ్యాన్‌పాడ్స్)తో కూల్చి ఉండొచ్చని తాజా నివేదిక ఒకటి చెబుతోంది. ఇదే నిజమైతే ఈ యుద్ధంలో చైనా ఇరాన్‌కు సహాయం చేసినట్లే.

ఈ నివేదికను అమెరికా మీడియా సంస్థ ఎన్‌బీసీ న్యూస్ ప్రచురించింది. రిపోర్టు ప్రకారం, చైనా నుంచి ఇరాన్‌కు సైనిక సాయం అందొచ్చని అమెరికన్ అధికారులు అనుమానిస్తున్నారు. స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించే రాడార్ వ్యవస్థ, లాంగ్ రేంజ్ నిఘా సాంకేతికతను చైనా ఇరాన్‌కు అందించినట్లు తెలుస్తోంది.

×
×
Ad

ఇదే సమయంలో భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి దాడిలో తమ యుద్ధ విమానం కూలిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు. సుమారు 7 అడుగుల పొడవు, 40 పౌండ్ల బరువు ఉండే ఈ తరహా క్షిపణులు తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలను టార్గెట్ చేసి దాడులు చేస్తాయి.

ఇరాన్ దాడి తర్వాత విమానంలో ఇద్దరు పైలట్లు ఎజెక్ట్ అయ్యారు. ఒక పైలట్‌ను 7 గంటల్లోనే యూఎస్ దళాలు రక్షించగా, మరో పైలట్ జాగ్రోస్ పర్వాతాల్లో దాక్కోవడంతో అతడిని గుర్తించడానికి 36 గంటల సమయం పట్టింది. రెండో పైటల్‌ను రక్షించేందుకు యూఎస్ ఇరాన్ భూభాగంలో భారీ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది.