ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు… ఇది సామెతే అనుకుంటే పొరపాటే. నిజజీవితంలో కూడా ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. 2109 వరకు ఆర్థిక, సాంకెతిక రంగాల్లో ప్రపంచదేశాలు పోటీ పడ్డాయి. అయితే, 2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా బయటపడింది. వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ కరోనా ల్యాబ్ నుంచి వచ్చిందని అమెరికాతో సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అందుకు చైనా ఒప్పుకోవడం లేదు. జంతువుల నుంచి మనిషికి సోకిందని చెబుతూ వచ్చింది. కరోనా పుట్టుకకు కారణం ఎంటి అన్నది ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కరోనా మహమ్మారి వలన ప్రపంచం మొత్తం ఆర్థికంగా నష్టపోయింది. ఇబ్బందులు పడుతున్నది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్నది. చైనాలోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే జియాంగ్, యోంగ్జూ నగరాల్లో లాక్ డౌన్ విధించారు. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.
Read: పాక్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి…
అయితే, సోమవారం రోజున యాన్యాంగ్ నగరంలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 5.5 మిలియన్ జనాభా కలిగిన యాన్యాంగ్ నగరంలోని ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు కేసులు బయటపడిన వెంటనే లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దీంతో ఎక్కడి వారు అక్కడే ఇళ్లకు పరిమితం అయ్యారు. ఎవర్నీ బయటకు అనుమతించడం లేదు. ఫిబ్రవరి 4 నుంచి బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో జీరో వైరస్ కంట్రీగా చైనాను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మరి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి.
