పాక్‌లో మ‌రో హిందూ దేవాల‌యంపై దాడి…

ప్ర‌పంచ‌మంతా క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతుంటే పాకిస్తాన్‌లో మాత్రం ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకోవ‌డంతోనే స‌రిపోతున్న‌ది.  పాక్‌లో హిందువులు మైనారిటీలు అన్న సంగ‌తి తెలిసిందే.  ఒక‌ప్పుడు పంజాబ్‌లోని సింథ్ ప్రాంతంలో వేలాది దేవాల‌యాలు ఉండేవి.  స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత పాకిస్తాన్‌లోని వేలాది హిందూ దేవాల‌యాల‌ను కూల్చివేశారు.  హిందూ దేవాల‌య‌ల కూల్చివేత కార్య‌క్ర‌మం ఇప్ప‌టికీ జ‌రుగుతూనే ఉన్న‌ది.  తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని థాకోర్ గ్రామంలోని హిందూ దేవాల‌యాన్ని కొంత‌మంది కూల్చివేశారు.  కూల్చివేత‌ను అడ్డ‌గించిన ముగ్గురు హిందూ మ‌హిళ‌ల‌పై దాడులు చేయ‌డంతో గాయ‌ప‌డ్డారు.  ఎవ‌రికి ఎలాంటి అడ్డంకులు క‌లిగించ‌కుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నామ‌ని, కానీ, త‌మ‌పై దాడులు చేస్తున్నార‌ని అక్క‌డి హిందువులు చెబుతున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. 

Read: త‌గ్గేదిలే: కిమ్ చెల‌గాటం… జ‌పాన్‌కు ప్రాణ‌సంక‌టం…

Related Articles

Latest Articles