NTV Telugu Site icon

China: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్.. సెకన్‌లో 150 సినిమాలు..

Internet Speed

Internet Speed

China: చైనా మరోసారి సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ని ఆవిష్కరించింది. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలదని దీన్ని సదరు కంపెనీ వెల్లడించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఈ వేగం ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే దాదాపుగా 10 రెట్లు అని చెప్పింది.

ఈ ప్రాజెక్టు సింఘువా యూనివర్సిటీ, సెర్నెట్ కార్పొరేషన్, హువాయ్ టెక్నాలజీ సహాకరాంతో 3000 కిలోమీటర్ల మేర ఈ ఇంటర్నెట్ వ్యవస్థను విస్తరించారు. బీజింగ్ర, వుహాన్, గ్వాంగ్ జౌల మధ్య ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సిస్టమ్ ద్వారా అనుసంధించారు. ఆశ్చర్యకరరీతిలో సెకనుకు 1.2 టెరా బిట్( 1200 గిగాబైట్) డేటాను ట్రాన్స్‌మిట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని చాలా ఇంటర్నెట్ బ్యాక్‌బోన్ నెట్వర్క్‌లు సెకనుకు కేవలం 100గిగాబిట్ల వేగంతో పనిచేస్తాయి. బీజింగ్-వూహాన్-గ్వాంగ్ జౌ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పై గత దశాబ్ధకాలంగా చైనా పనిచేస్తోంది. తాజాగా ఈ నెట్వర్క్ ద్వారా అత్యంత వేగంగా ఇంటర్నెట్ ప్రసారాలు జరిగాయి. ఈ నెట్వర్క్ జూలై నెలలో ప్రారంభమైనప్పటికీ.. సోమవారం అధికారంగా ప్రారంభించారు.

Read Also: Israel-Hamas War: గాజాలో పిల్లలు చనిపోవడం ఆగాలన్న జస్టిన్ ట్రూడో.. ఇజ్రాయిల్ ప్రధాని స్పందన ఇదే..

ఈ నెట్వర్క్ ఎంత వేగంగా పనిచేస్తుందనే దాన్ని వివరించేందుకు హువాయ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ ఓ ఉదాహరణను చెప్పారు. ఇది కేవలం 150 హైడెఫినేషన్(హెచ్‌డీ) సినిమాలకు సమానమైన డేటాను కేవలం ఒక సెకనులోనే ట్రాన్స్‌ఫర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించారు.సింఘువా యూనివర్సిటీకి చెందిన జుమింగ్ వీ ఈ కొత్త ఇంటర్నెట్ వ్యవస్థని సూపర్ ఫాస్ట్ రైల్ ట్రాకుతో పోల్చారు. ఇది మొత్తం డేటాను తీసుకెళ్లడానికి 10 ట్రాకుల అవసరాన్నీ భర్తీ చేస్తుందని, దీని ఫలితంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు.