China’s 3rd Aircraft: అగ్రరాజ్యం అమెరికాతో చైనా నౌకాదళం పోటీ పడుతుంది. ఈ సందర్భంగా తన ఆయుధ సంపత్తిని విస్తరించేందుకు ప్లాన్ చేసింది. అందులో భాగంగా అత్యంత సామర్థ్యం కలిగిన ‘ఫుజియాన్’ యుద్ధ నౌకను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ విమాన వాహన నౌకను చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ ప్రారంభించినట్లు సమాచారం.
Read Also: 300 Flights Delayed: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన 300 విమానాలు.. ఎక్కడో తెలుసా..?
అయితే, బుధవారం హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఈ సందర్భంగా జిన్‌పింగ్ యుద్ధ నౌకను పరిశీలించినట్లు అందులో పేర్కొనింది. ఫుజియాన్ చైనాకు చెందిన మూడో అత్యంత అధునాతన యుద్ధ నౌకగా అభివర్ణించారు. విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఎమాల్స్‌ను అందులో ఉపయోగించారు. 316 మీటర్ల పొడవు, 80 వేల టన్నుల బరువు ఉన్న ఈ ఫుజియాన్‌కు దాదాపు 50 విమానాలను సులభంగా మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.
Read Also: Konda Rajiv Gandhi: చంద్రబాబుది టార్చ్ లైట్ పాలనైతే.. జగన్ ది టార్చ్ బేరర్ పాలన..
ఇక, ఈ ఎమాల్స్ వ్యవస్థను అమెరికాకు చెందిన ‘గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ శ్రేణి విమాన వాహన నౌక మాత్రమే ఉపయోగించుకుంటుంది. ఇటీవల ఈ ఫుజియాన్ గురించి డ్రాగన్ అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ఇది సాయుధ దళాల ఆధునికీకరణలో కీలకమైన మైలురాయి అని వెల్లడించారు. బీజింగ్‌కు ఈ నౌక వ్యూహాత్మక సాధనంగా మారుతుందన్నారు. తమ దేశ గౌరవాన్ని పెంచుతుందని తెలియజేశారు. కాగా, మరో విమాన వాహక నౌకను నిర్మించేందుకు కూడా చైనా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. టైప్-004గా ఇది వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎమాల్స్ సాంకేతికతతో పాటు అణు సామర్థ్యంతో నిర్మించాలని బీజింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.