డ్రాగన్ కంట్రీ ఎప్పుడూ దూకుడుగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చైనాలో జననాల రేటు పడిపోవడంతో.. అది పెంచే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రజలను ప్రోత్సహంచేలా చైనా చేయని ప్రయత్నం లేదు.
Also Read : Ambati Rambabu: నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటా..
అందుకోసం ప్రస్తుతం ప్రేమలో పడండి అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు చైనాలో తొమ్మిది కళశాలల్లోని విద్యార్థులను ప్రేమలో పడండి అంటూ ఏప్రిల్ నెలలో వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం. ఫ్యానమీయి ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న మిన్యాంగ్ ప్లయింగ్ వోకేషన్ లో కాలేజ్ మొదటి మార్చి 21 నుంచి వసంత విరామాన్ని ప్రకటించింది. ప్రకృతిని ఆస్వాధిస్తూ.. జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని విద్యార్థులను చైనా దేశం ప్రొత్సహిస్తోంది.
Also Read : Costume Krishna: అభినయంతోనూ అలరించిన ‘క్యాస్టూమ్స్’ కృష్ణ!
జననల రేటును పెంచడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం అని చెబుతుండటం విశేషం. అదీగాక జనన రేటును పెంచడానికి ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. ఐతే నిఫుణులు జనాబా క్షీణతను తగ్గించే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ.. ఇదోక ప్రయత్నంగా తెరమీదకు తీసుకుచ్చి అమలు చేస్తున్నారు. వాస్తవానికి 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానం చైనాను తన గుంత తనే తవ్వుకునేలా చేసింది. కరోనా మహమ్మారి తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చైనాలో ఒక్కసారిగా జననాల రేటు ఘోరంగా పడిపోయింది.
Also Read : Costume Krishna: ఆరెండు సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ సినిమాలకు దూరమయ్యేలా చేశాయి?
దీంతో డ్రాగన్ కంట్రీ జనాభాను పెంచేందుకు రకరకాలుగా యత్నిస్తున్నా.. అందుకు ప్రజలు సుముఖంగా లేరు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల కారణంగా వారి సంరక్షణ విద్యకు సరిపడే ఆదాయం లేకపోవడంతో విముఖత చూపిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాలకు పలు రాయితీుల కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్న.. ప్రజల నుంచి సానూకూల స్పందన రాకపోవడం గమనార్హం. దీంతో నిపుణుల జనాభా క్షీణతను నియంత్రించేలా ఇలా వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తుంది.