Fake Condoms: “కండోమ్‌”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..

  • కండోమ్‌లను కూడా వదలని చైనా.
  • 2 లక్షలకు పైగా నకిలీ కండోమ్‌లు యూరప్‌లో స్వాధీనం.
  • రొమేనియా, సెర్బియా, స్పెయిన్‌లో పట్టుబడిన ఫేక్ మాల్..
Fake Condoms

Fake Condoms

Fake Condoms: చైనాలో ఏ బ్రాండ్ వస్తువుకైనా నకిలీ లభిస్తుంటాయి. అంతగా ఆ దేశం ప్రతీ వస్తువును కాపీ కొడుతుంది. మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి బ్రాండెడ్ దుస్తుల వరకు ప్రతీది కాపీ సరకు చైనాలో లభ్యమవుతుంది. చివరకు ‘‘కండోమ్’’లను కూడా డ్రాగన్ కంట్రీ వదలడం లేదు. ఏకంగా 2 లక్షల నకిలీ కండోమ్‌లు యూరప్‌లో పట్టుబడ్డాయమి. కఠినమైన భద్రతా నిబంధనల్ని తప్పించుకునేందుకు, ఈ కండోమ్‌లను ఆట వస్తువులుగా మార్చి, మార్కెట్ చేశారు.

ఇలాంటి కండోమ్‌లు వాడితే లైంగిక వ్యాధులు(STIs)తో పాటు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని అధికారులు చెబుతున్నారు. యూరప్ యొక్క మోస నిరోధక సంస్థ అయిన యూరోపియన్ యాంటీ-ఫ్రాడ్ ఆఫీస్ (OLAF) ఈ మోసాన్ని వెలికితీసింది. ఈ దర్యాప్తులో 2,00,000 యూరోలకు పైగా మొత్తం విలువ కలిగిన 2,00,000 కంటే ఎక్కువ నకిలీ కండోమ్‌లు చైనా నుండి యూరప్‌కు రవాణా చేయబడినట్లు వెల్లడైంది.

రోమేనియా, సెర్బియా, స్పెయిన్ దేశాల్లో ఈ నకిలీ కండోమ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారుల్ని మోసం చేయడానికి ప్రముఖ బ్రాండ్ పేరు, లోగోలను కూడా ఉపయోగించుకున్నారు. సాధారణంగా యూరప్‌లో కండోమ్‌లను వైద్య పరికరాల కేటగిరీ కింద ఉంటాయి. అందువల్ల, మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ముందు అనేక రకాల నాణ్యతా తనిఖీలకు గురిచేస్తారు. కానీ చైనా నుంచి వచ్చిన ఈ ఫేక్ కండోమ్‌లు ఆటవస్తువులుగా ప్రకటించి భద్రతా తనిఖీల నుంచి తప్పించుకున్నాయి. చివరకు అధికారులు ఈ ఫేక్ దందాను బయటపెట్టారు.