Site icon NTV Telugu

China Bus Blast : ఒకరు మృతి.. 42 మందికి గాయాలు..

ఈశాన్య చైనాలో శనివారం బస్సు పేలి ఒక వ్యక్తి మరణించగా, 42 మంది గాయపడినట్లు పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు తెలిపారు. లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, 42 మంది తీవ్రంగా గాయపపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మరో 40 మందికి స్వల్ప గాయాలైనట్లు షెన్యాంగ్ అధికారులు తెలిపారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అక్కడి ప్రభుత్వం వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మరో వీడియో క్లిప్‌లో పేలుడు తరువాత ప్రజలు బస్సు దగ్గర రోడ్డు పక్కన కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. అయితే పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Exit mobile version