ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో 40 గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతోంది.. ఇది మన దగ్గర అని కలలు కనొద్దు.. ఎందుకంటే.. ఇది భారత్‌లో కాదు.. చిలీలో.. ఈ దేశం పని గంటలను వారానికి 40కి తగ్గించాలని యోచిస్తోంది.. పని గంటలను తగ్గించడానికి చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ బిల్లును తీసుకొచ్చారు.. చిలీ రాజ్యాంగంలోని ఒక నిబంధన ప్రకారం.. అధ్యక్షుడు ఆదేశించినప్పుడు బిల్లును చట్టసభలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ప్రభుత్వం మంగళవారం మాట్లాడుతూ.. దేశంలో పని గంటలను తగ్గించే బిల్లును ఆమోదించడానికి మరియు ప్రచార హామీని నెరవేర్చడానికి ప్రయత్నాలను పునరుద్ధరించింది. ఐదేళ్లలోపు పని గంటలను వారానికి 45 నుండి 40 గంటలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న బిల్లును.. 2017లో అప్పటి చట్టసభ సభ్యులు మరియు ప్రస్తుత ప్రభుత్వ ప్రతినిధి కమీలా వల్లేజో ప్రవేశపెట్టినప్పటి నుండి కాంగ్రెస్‌లో నిలిచిపోయింది.
Read Also: Mekathoti Sucharita: పవన్ కల్యాణ్ కలలు కంటున్నారు..
అయితే, ప్రస్తుతం చిలీ ప్రెసిడెంట్ గాబ్రియెల్ బోరిక్ పనిగంటల్ని తగ్గిస్తూ ‘అత‍్యవసర’ బిల్లుగా పరిగణలోకి తీసుకున్నారు. సభ్యులు అంగీకారంతో ఆ బిల్లు అమలు కానుంది. చట్టసభ సభ్యులు బోరిక్ ఆదేశాలతో పనిగంటల్ని తగ్గించడంతో పాటు అదనంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే కార్మికులకు సైతం పనిగంటల్ని తగ్గించే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.. అధ్యక్ష భవనంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బోరిక్ మాట్లాడుతూ.. కొత్త చిలీకి మమ్మల్ని దగ్గరికి తీసుకురావడానికి ఈ మెరుగుదలలు చాలా అవసరం అన్నారు.. కాగా, ప్రపంచంలోని అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుగా ఉంది చిలీ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సమయంలో మరియు మహమ్మారి అనంతర పునరుద్ధరణ తర్వాత బలమైన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో అక్కడి వామపక్ష ప్రభుత్వం చిన్న, మధ్య మరియు పెద్ద కంపెనీల ప్రతినిధులతో పాటు యూనియన్‌లు మరియు వర్కర్ ఫెడరేషన్‌లతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చింది.. ఉభయ సభలు వీలైనంత త్వరగా బిల్లుపై ఓటు వేసి ఆమోదం పొందాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు బోరిక్ పేర్కొన్నారు.
