Site icon NTV Telugu

టైటానిక్ త‌ర‌హాలో… రెండు ముక్క‌లైన జ‌పాన్ షిప్‌..

టైటానిక్ షిప్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే.  మొద‌టి ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో ప్ర‌యాణం చేయ‌డానికి ఈ షిప్‌ను త‌యారు చేశారు.  అప్ప‌ట్లో ఇది లగ్జ‌రియ‌స్ షిప్‌గా పేరు తెచ్చుకుంది.  అయితే మార్గ‌మ‌ధ్యంలో ఐస్‌బ‌ర్గ్‌ను ఢీకొన‌డం వ‌ల‌న రెండు ముక్క‌ల‌య్యి స‌ముద్రంలో మునిగిపోయింది.  ఇక ఇదిలా ఉంటే, జ‌పాన్ స‌ముద్ర తీరంలో 39,910 టన్నుల బ‌రువైన ఓ భారీ ర‌వాణా షిప్ రెండు ముక్క‌లుగా విరిగిపోయింది.  ఈ ప్ర‌మాదం త‌రువాత ఆ షిప్‌లోని ఆయిల్ కొంత‌మేర లీక్ అయింది.  వెంట‌నే జ‌పాన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి షిప్ నుంచి ఆయిల్ కాకుండా స‌రిచేశారు.  అయితే, భారీ క‌ల‌ప లోడ్ తీసుకొని వెళ్తున్న ఈ షిప్ ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా విరిగిపోయిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  అయితే, ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని జపాన్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

Read: 19న ‘క్రేజీ అంకుల్స్’ విడుద‌ల‌

Exit mobile version