NTV Telugu Site icon

American Airlines: దారుణం.. సాయం కోరిన పాపానికి సిబ్బంది పైశాచికం

American Airlines

American Airlines

Cancer Patient On Delhi-New York Flight Seeks Help With Bag Offloaded: అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓ భారత మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కేవలం తన బ్యాగును క్యాబిన్‌లో పెట్టమని సాయం కోరిన పాపానికి.. ఆమెను ఏకంగా విమానంలో నుంచే దించేశారు. జనవరి 30వ తేదీన ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. మీనాక్షి సేన్‌గుప్తా అనే మహిళ జనవరి 30న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 293లో టికెట్‌ బుక్‌ చేసుకుంది. అయితే.. కొన్ని రోజుల క్రితమే క్యాన్సర్ సంబంధిత శస్త్రచికిత్స జరగడంతో, ఆమె వీల్‌ఛైర్‌ అసిస్టెంట్‌ ద్వారా విమానం ఎక్కింది. తాను అనారోగ్యంగా ఉండటంతో.. తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను క్యాబిన్‌లో పెట్టాలని ఓ ఎయిర్‌హోస్టెస్‌ సాయం కోరింది. అయితే.. ఆమె సాయం చేయడానికి తిరస్కరించింది. అంతటితో ఆగకుండా.. విమానం నుంచి దిగిపోవాలని కోరింది. ఆమెతో పాటు మొత్తం సిబ్బంది దిగిపోవాలని కోరడంతో.. ఆమె అవమానంగా భావించి విమానం దిగిపోయింది.

Actor Sushanth: రెవెరా ప్లాస్టిక్ సర్జరీ, స్కిన్ కేర్ ను ప్రారంభించిన హీరో సుశాంత్!

ఈ ఘటనపై మీనాక్షి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ఎదురైన ఈ అవమానం గురించి మీనాక్షి మాట్లాడుతూ.. ‘‘గ్రౌండ్‌ స్టాఫ్‌ నన్ను విమానంలో విడిచిపెట్టిన తర్వాత నా బ్యాగ్‌ను క్యాబిన్‌లో పెట్టాల్సిందిగా ఒక ఎయిర్‌హోస్టెస్‌ సహాయం కోరాను. అయితే.. అది తన ఉద్యోగం కాదని చెప్పి ఆమె వెళ్లిపోయింది. నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వివరించినప్పటికీ.. ఆమె సహాయం చేయలేదు. దీంతో గత్యంతరం లేక నా బ్యాగ్‌ను సీటు పక్కనే ఉంచి కూర్చున్నాను. కాసేపయ్యాక ఆ ఎయిర్‌హోస్టెస్ మళ్లీ నా దగ్గరికి వచ్చి, ‘మీకు అసౌకర్యంగా ఉంటే విమానం నుంచి దిగిపోవచ్చు’ అంటూ అమర్యాదగా చెప్పింది. ఆమెతో పాటు విమాన సిబ్బంది మొత్తం దిగిపోవాలని కోరింది. దాంతో అవమానంగా భావించి, నేను విమానం నుంచి దిగిపోయా’’ అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌‌, నివేదిక సమర్పించాల్సిందిగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ను కోరింది. అయితే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ వాదన మాత్రం మరోలా ఉంది. విమానంలో సిబ్బంది సూచనలు పాటించకపోవడం వల్లే ఆమెను విమానం నుంచి దించేశారని ఒక ప్రకటనలో తెలిపింది.

Vani Jayaram: ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది.. ఆ గాయాలకు కారణమిదే!

Show comments