NTV Telugu Site icon

Israel: అరెస్టు వారెంట్‌ను క్యాన్సిల్ చేయండి.. అంతర్జాతీయ కోర్టుకు ఇజ్రాయెల్‌

Isreal

Isreal

Israel: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, మాజీ రక్షణశాఖ మంత్రి యోవ్‌ గల్లాంట్‌పై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈక్రమంలోనే ఆ అరెస్టు వారెంట్‌ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఇజ్రాయెల్‌ ఇంటర్నేషనల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అరెస్ట్ వారెంట్ ను రద్దు చేయాలని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొనింది. ఈ మేరకు ప్రధాని ఆఫీసు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు మాపై జారీ చేసిన అరెస్టు వారెంట్లను సవాలు చేసినట్లు వెల్లడించింది. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే ఐసీసీ మాకు వ్యతిరేకంగా.. ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తుందో అమెరికాతో సహా మా మిత్ర దేశాలకు తెలుస్తుందని అందులో చెప్పుకొచ్చారు.

Read Also: 2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరలించే ఛాన్స్..?

కాగా, ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గాజాలో అనేక మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు మాజీ మంత్రి గల్లాంట్‌లు.. గాజాలో హత్యలు, హింసాత్మాక ఘటనలకు కారణం అయ్యారని.. దీంతో ఆకలిచావులు లాంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపణలు చేసింది. దాంతో మానవ సంక్షోభం తీవ్రమవుతుండటం వల్ల మరణాలకు దారి తీసిందని చెప్పుకొచ్చింది. ఎంతో మంది చిన్నారులు బాధితులుగా మారిపోయారు. అక్కడి పౌరులను టార్గెట్ గా చేసుకున్నారనడానికి తగినన్ని ఆధారాలు గుర్తించామని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ తెలిపింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధానితో పాటు మాజీ రక్షణమంత్రిపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసినట్లు వెల్లడించింది.