NTV Telugu Site icon

Canada: కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌పై భారత హ్యాకర్ల దాడి..?

Canada India

Canada India

Canada: కెనడా ఆర్మీ వెబ్‌సైట్ పై భారత హ్యకర్తు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కెనడా ఆర్ముడ్ ఫోర్సెస్ అధికారిక వెబ్‌సైట్ బుధవారం తాత్కాలికంగా నిలిపేవారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఈ వెబ్‌సైట్ పై ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ అనే హ్యకర్ల టీం హ్యాక్ చేసింది, దీనికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించిందని తెలిపింది.

వైబ్‌సైట్ లో అంతరాయాన్ని బుధవారం మధ్యాహ్నం గుర్తించినట్లు, ఆ తర్వాత సరిదిద్దినట్లు నేషనల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ మీడియా రిలేషన్స్ హెడ్ డేనియల్ లే బౌథిల్లియర్ ది గ్లోబ్ అండ్ మెయిల్‌తో అన్నారు. ఈ సైబర్ ఎటాక్ కి పాల్పడినట్లు ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ ట్విట్టర్ లో వెబ్‌సైట్ లో ఎర్రర్ మెసేజ్ ఉన్న స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. కొంత మంది డెస్క్‌టాప్ వినియోగదారులు సైట్ ని యాక్సెస్ చేయగలిగినప్పటికీ.. మొబైల్ యూజర్లకు మాత్రం యాక్సెస్ చేయలేకపోయారు.

Read Also: Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం పొదుపు చేస్తే.. రూ.18 లక్షలను మాయం చేసిన చెదలు..

ప్రస్తుతం కెనడా అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నారు. తమ దాడుల శక్తిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని గతంలో సోషల్ మీడియా ద్వారా ఇండియన్ సైబర్ ఫోర్స్ సెప్టెంబర్ 21న కెనడాను బెదిరించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇందులో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. ఇందుకు ప్రతిగా భారత్ కూడా సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను కూడా బహిష్కరించింది.

Show comments