NTV Telugu Site icon

Justin Trudeau: కెనడాలో అంతర్గత తిరుగుబాటు.. రాజీనామా చేసే యోచనలో జస్టిన్ ట్రూడో..?

Justin Trudea

Justin Trudea

Justin trudeau: కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న లిబరల్‌ పార్టీతో పాటు ప్రధాని పదవి నుంచి ఆయన వైదొలిగే ఛాన్స్ ఉందని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ వార్త సంస్థల్లో కథనాలు ప్రచారం చేశాయి. నేషనల్‌ కాకస్‌ మీటింగ్‌కు ముందే ట్రూడో పదవీకి రాజీనామా చేస్తారని తెలుస్తుంది. అయితే, 2013 నుంచి లిబరల్‌ పార్టీ నేతగా జస్టిన్‌ ట్రూడో ఉన్నారు. ఆ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఇప్పటి వరకు ఆయన కార్యాలయం స్పందించలేదు. ట్రూడో కార్యాలయం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.

Read Also: CM Chandrababu: నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు.. ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’కు శ్రీకారం!

అయితే, జస్టిన్ ట్రూడో తక్షణమే రాజీనామా చేస్తారా లేక కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఫెడరల్ ఎన్నికలలో ట్రూడో యొక్క లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోతాయని అనేక ఎగ్జిట్ పోల్‌లు తెలియజేస్తున్నాయి. ఈ పరిణామలతో ట్రూడో విధానాలపై దేశ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ వైదొలిగిన నెల లోపే జస్టిన్ ట్రూడో చేస్తున్నారనే కథనాలు తెర పైకి వచ్చాయి.

Show comments