NTV Telugu Site icon

Canada Govt: కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం.. వలసదారుల సంఖ్య భారీగా తగ్గింపు

Canada

Canada

Canada Govt: వలసల నియంత్రణకు కెనడా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు రెడీ అయింది. మరోసారి అధికారంలోకి రావాలనే టార్గెట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడి న్యూస్ ఛానల్స్ తో ఈ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల ప్రకారం.. 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా గుర్తించిన కెనడా సర్కార్.. 2025లో ఈ సంఖ్య 3,80,000లకు మాత్రమే పరిమితం చేసింది. 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలోచనతో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో ఎక్స్‌ (ట్విట్టర్) లో ఓ పోస్ట్‌ చేశారు. ‘కెనడాలో తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నామన్నారు. ఇక, కంపెనీలు తొలుత కెనడియన్ కార్మికులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాయో చెప్పాలన్నారు.

Read Also: kanguva : సూపర్ స్టార్ అంటే ఆయన మాత్రమే..

ఇక, వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన సర్వేల్లో జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ సర్కార్ వెనకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగడంతో పాటు దేశీయంగా ఇళ్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ.. అందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది.