Canada Elections: ఎన్నికల్లో ఓడిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్..
- కెనడా ఎన్నికల్లో ఓడిపోయిన ఖలిస్తానీ మద్దతుదారుడు..
- లిబరల్స్ చేతిలో ఓడిన జగ్మీత్ సింగ్..
- మళ్లీ అధికారంలోకి రానున్న లిబరల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Elections: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖలిస్తాన్ మద్దతుదారుడు న్యూ డెమెక్రాటిక్ పార్టీ(ఎన్డీపీ) చీఫ్ జగ్మీత్ సింగ్ ఓడిపోయాడు. తన స్థానాన్ని గెలవకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్స్ అధికారం నిలుపుకున్నప్పటికీ, మెజారిటీ ప్రభుత్వానికి తగినంత బలం సాధించడంలో సక్సెస్ కాలేదు.
Read Also: Vaibhav Suryavanshi : 8 ఏళ్ళ వయసులో ధోనీ కోసం… వైభవ్ చిన్ననాటి ఫోటో వైరల్…!
Also Read
- Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
బ్రిటిష్ కొలంబియాలోని బర్నాబీ సెంట్రల్ సీట్ నుంచి పోటీ చేసిన జగ్మీత్ సింగ్ లిబరల్ పార్టీ అభ్యర్థి వాడే చాంగ్ చేతిలో ఓడిపోయారు. సింగ్‌కి 27 శాతం ఓట్లు రాగా, చాంగ్ 40 శాతానికి పైగా ఓట్లు సాధించారు. జగ్మీత్ సింగ్ ఎన్డీపీ పార్టీ కూడా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జాతీయ పార్టీ హోదాకు అవసరమయ్యే 12 సీట్లను సాధించలేకపోతోంది. దీంతో ఆ పార్టీ జాతీయ హోదా రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
46 ఏళ్ల జగ్మీత్ సింగ్ ఓటమి పట్ల నిరాశ చెందానని అన్నారు. కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం లిబరల్స్ 164 సీట్లలో ముందంజలో ఉన్నారు. 147 స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ నిలిచింది. ఓట్లు ఇంకా లెక్కించబడుతున్నాయి. నిజానికి, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలివ్రేకు ప్రజా మద్దతు ఉన్నట్లు సర్వేలు చెప్పాయి. అయితే, ట్రూడో దిగిపోయి, కార్నీ ప్రధాని అయిన తర్వాత ప్రజల నిర్ణయంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పియార పోయిలివ్రే ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అతడి పార్టీ బలమైన ప్రతిపక్షాన్ని నిర్మించే దిశగా పయనిస్తోంది.
తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..