Canada Elections: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ వరసగా మూడోసారి ఘన విజయం సాధించి, అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు తీసుకోనున్నారు. కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి.
Canada Elections: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖలిస్తాన్ మద్దతుదారుడు న్యూ డెమెక్రాటిక్ పార్టీ(ఎన్డీపీ) చీఫ్ జగ్మీత్ సింగ్ ఓడిపోయాడు. తన స్థానాన్ని గెలవకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్స్ అధికారం నిలుపుకున్నప్పటికీ, మెజారిటీ ప్రభుత్వానికి తగినంత బలం సాధించడంలో సక్సెస్ కాలేదు.
Canada: డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమెరికాలో అక్రమంగా డాక్యుమెంట్లు లేకుండా నివసిస్తున్న వారిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బహిష్కరిస్తోంది. ఇప్పుడు కెనడా కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది.