Site icon NTV Telugu

Cake Auction: 41 ఏళ్ల నాటి కేక్‌ వేలం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Cake Auction

Cake Auction

Cake Auction: 41 ఏళ్ల నాటి ఓ కేక్‌ ముక్కను వేలం వేయనున్నారు. నాలుగు దశాబ్దాల నాటి కేక్‌ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది మరి. అసలు అంతకాలం కేక్‌ ముక్క ఈనాటికి ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? అసలు దాన్ని వేలం వేయడానికి కారణమేంటి? ఆ కేక్‌ ఎక్కడిది? ఎవరు తిన్నది? ఏ సందర్భంలో కట్ చేసింది? అనే అనుమానాలు రాక తప్పవు. 41 ఏళ్ల నాటి కేకు ముక్కను వేలం వేస్తున్నారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది మరి. నిజమే మరి.. ఆ కేక్‌ ముక్కకు అంతటి ఘనత ఉందండోయ్‌. బ్రిటన్‌ కింగ్ చార్లెస్‌, రాణి డయానా పెళ్లి నాటి కేక్‌ కావడమే ఆ కేక్‌ ముక్క విశేషం. ఈ కేక్‌ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన డోరే అండ్‌ రీస్‌ ఆక్షన్స్‌ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేకును వేలం వేసేందుకు సిద్ధమైంది.

1981లో జరిగిన కింగ్‌ చార్లెస్‌ – ప్రిన్సెస్‌ డయానాల పెళ్లికి ప్రపంచ దేశాల నుంచి 3వేల మందికి పైగా బంధుమిత్రులు హాజరయ్యారు. లక్షలాది మంది ఆ వివాహాన్ని టీవీల్లో వీక్షించారు. దాంతో 20వ శతాబ్దంలోనే గొప్ప పెండ్లిగా అది రికార్డుల్లో నిలిచింది. అయితే పెండ్లికి హాజరైన మూడు వేల మందిలో నిగెల్‌ రికెట్స్‌ అనే వ్యక్తి కూడా ఒకరు. ఆయనకు కూడా ఈ పెళ్లిలో ఓ కేకు ఇచ్చారు. నిగెల్‌ ఆ కేకును ఇంటికి తీసుకెళ్లి పూర్తిగా తినకుండా కొంత భాగాన్ని భద్రపరిచారు. గత ఏడాది ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన భద్రపరిచిన కేకు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. నిగెల్ రికెట్స్‌ భద్రపరిచిన ఆ కేకు ముక్కను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. వేలంలో ఆ కేకు ముక్క ప్రారంభ ధరను భారత కరెన్సీలో సుమారు రూ.27వేలుగా నిర్ణయించారు.

Tamilnadu Assembly: ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ నిషేధం బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం

నిగెల్‌ రికెట్స్‌ బతికి ఉండగా.. ఈ కేకులోని ఓ ముక్కను వేలం వేశారు. 2014లో జరిగిన ఈ వేలంలో ఈ కేకు ముక్క మన కరెన్సీలో రూ.1.27లక్షలు పలికింది. కాగా రికెట్స్, ఇతర రాజ కుటుంబ సభ్యులు చార్లెస్-డయానా కోసం వివాహ కానుకగా ఒక రైటింగ్ టేబుల్‌ను బహూకరించారట. ఆ టేబుల్‌ను చూసి కింగ్‌ చార్లెస్‌ చాలా సంతోషపడ్డారట. ఇదిలావుంటే 1981, జూలై 29న జరిగిన చార్లెస్‌-డయానాల వివాహ బంధం కొన్నేండ్లకే తెగిపోయింది. 1992లో వారు విడిపోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రమాదంలో డయానా ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version