Site icon NTV Telugu

Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

Srilanka

Srilanka

శ్రీలంకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు లోయలో పడి పోయింది. 250 అడుగుల పైనుంచి బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మున్సిపల్ కార్మికులు మృతి చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సెలవుల నేపథ్యంలో రావణా ఎల్లా దగ్గరకు మున్సిపల్ కార్మికులు మినీ బస్సులో వెళ్తున్నారు. కొండపైకి వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో బస్సు అదుపు తప్పి లోయలో పడి పోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. 15 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. మరో 18 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని బదుల్లా టీచింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mirai : సెన్సార్ పనులు ముగించుకున్న ‘మిరాయ్’.. రన్‌టైమ్ ఎంతంటే ?

గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై 24వ కిలోమీటర్ పోస్ట్ సమీపంలో గురాత్రి రాత్రి మినీ బస్సు కొండచరియలో పడిపోయిందని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో భద్రతా దళాలు, పోలీస్ సిబ్బంది సహాయ చర్యలు పాల్గొన్నట్లు చెప్పారు. అయితే చీకటి కారణంగా సహాయ చర్యలు ముందుకు సాగడం లేదని వెల్లడించారు. టంగల్లె మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగుల బృందం విహారయాత్రకు వెళ్లినట్లుగా చెప్పారు. ఈ బృందం ఎల్లా నుంచి తంగల్లెకు తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నట్లు సమాచారం. దాదాపు 500 మీటర్ల దూరంలో బోల్తా పడి ఆగిపోయినట్లుగా వివరించారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Digital Arrest : వృద్ధ దంపతులను బెదిరించి రూ.40 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

Exit mobile version