NTV Telugu Site icon

Buddha Air Flight: మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 76 మంది సేఫ్!

Budda

Budda

Buddha Air Flight: నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి భద్రాపూర్‌కు వెళ్తున్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఫ్లైట్ లోని ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన పైలట్‌ ఈ విషయాన్ని తక్షణమే అధికారులకు నివేదించాడు. అనంతరం విమానాన్ని త్రిభువన్‌ విమానాశ్రయానికి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్‌ చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Supreme Court: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ కేసుల‌ను క‌ర్ణాటక హైకోర్టుకు బ‌దిలీ..

కాగా, ఈ సమస్యపై బుద్ధ ఎయిర్‌లైన్స్‌ రియాక్ట్ అయింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని తిరిగి కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించామని వెల్లడించారు. ఈరోజు ఉదయం 11:15 గంటలకు త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని చెప్పారు. మా సాంకేతిక టీమ్ ప్రస్తుతం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తోందని తెలిపారు. మరో విమానంలో ప్రయాణికులను భద్రాపూర్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని బుద్ధ ఎయిర్‌లైన్స్‌ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చింది.