NTV Telugu Site icon

Bangladesh Crisis: బంగ్లాదేశ్లో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్-బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ హై అలర్ట్..!

Bsf

Bsf

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి దేశం వదిలి పెట్టి పారిపోయారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ రాలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హ‌సీనాతో పాటు ఆమె సోద‌రి షేక్ రెహానా భారత్ వైపుకు ప‌య‌న‌మైన‌ట్లు కొన్ని వార్త సంస్థలు తెలిపాయి.

Read Also: Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?

కాగా, బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు ఇవాళ (సోమవారం) హై అలర్ట్ ప్రకటించారు. బీఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా వదిలి వెళ్లిన కొద్ది గంటలకే ఈ హెచ్చరికలను బీఎస్ఎఫ్ వెల్లడించింది. అయితే, బంగ్లాదేశ్‌తో భారత్ 4000 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది.

Read Also: Kannappa: ‘కన్నప్ప’లో ముండడుగా దేవరాజ్.. లుక్ రిలీజ్

అయితే, షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ వెల్లడించారు. తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకు వస్తామన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హింసను ఆపమని పౌరులను కోరుతున్నాం.. గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలపై దర్యాప్తు చేస్తాము అని ఆర్మీ చీఫ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించలేదన్నారు. ఈ రాత్రికి సంక్షోభానికి ఓ పరిష్కారం దొరుకుతుంది అని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్- ఉజ్- జమాన్ తెలిపారు.