NTV Telugu Site icon

Rishi Sunak’s controversial speech: వివాదంగా మారిన బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలు.. ఇది లింగ వివక్షే..!

Untitled 2

Untitled 2

International politics: మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అంటారు మన పెద్దలు. ఎదుకుకంటే అలానాలోచిత వ్యాఖ్యలు అనర్ధాలకు కారణమవుతాయి. కొన్ని సందర్భాలలో మనకి కరెక్ట్ అనిపించి మాట్లాడిన మాటలు ఇతరులకు తప్పుగా అనిపించవచ్చు. అందుకే అందురూ మెచ్చేలా మాట్లాడకపోయినా పర్లేదుకాని.. ఎవరు విమర్శించకుండా మాత్రం మాట్లాడాలి. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఎంతో జగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ఇలా ప్రజలతో మాటలు పడాల్సి వస్తుంది. ఇంతకీ అసలేం జరిగింది అనుకుంటున్నారా..? బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ జెండర్ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వివరాలలోకి వెళ్తే.. అక్టోబర్ 4న మాంచెస్టర్‌లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ సమావేశానికి హాజరుఅయ్యారు బ్రిటిష్ ప్రధాని రిషి సునక్. ఈ నేపథ్యంలో అయన ఇచ్చిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ఆయన ప్రసంగిస్తూ “ఒక పురుషుడు ఒక పురుషుడు మరియు స్త్రీ ఒక స్త్రీ” .

Read also:CM Jagan Delhi Tour: హస్తినకు సీఎం వైఎస్‌ జగన్‌.. విషయం అదేనా..?

ఏ సెక్స్‌గా ఉండాలనుకుంటున్నారో అది మన చేతుల్లో లేదు అని గ్రహించడం కనీస ఇంగితజ్ఞానం” అని పేర్కొన్నారు. కాగా తాను దేశాన్ని మార్చబోతున్నాడని, జీవితం అంటే ప్రాణమని తెలిపిన ఆయన ఆసుపత్రుల సిబ్బంది రోగులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పురుషుల లేదా మహిళల అని తెలుసుకోవాలి అన్నారు. కాగా ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే అక్టోబర్ 3న ఇంగ్లాండ్‌లోని మహిళా ఆసుపత్రి వార్డులలో లింగమార్పిడి మహిళలకు చికిత్స చేయకుండా నిషేధించే ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన అనంతరం రిషి సునక్ ఇలా మాట్లాడడం చరణీయాంశంగా మారింది. కాగా కొందరు రిషి సునక్ ని సమర్దిస్తుంటే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషి సునక్ ఇంకితజ్ఞానానికి చాల దూరంగా ఉన్నారని.. రిషి సునక్ ని విమర్శిస్తూ ఎగతాళి చేస్తున్నారు.