ఓ వైపు కరోనా విజృంభిస్తోంది.. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది.. కానీ, ఇదే సమయంలో ఓ పార్టీ జరిగింది.. అది కూడా ప్రధాని నివాసం ఉన్న వీధిలోనే.. ఇదే ఇప్పుడు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను చిక్కుల్లో పడేసింది… ఆయన నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన ఓ పార్టీ వ్యవహారంలో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను రాశారు.. వాటికి సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల డెడ్‌లైన్ పెట్టారు.. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం కూడా ధ్రువీకరించింది. దీంతో.. లాక్‌డౌన్‌లో పార్టీ వ్యవహారంలో ప్రధాని బోరిన్ జాన్సన్‌ను వివాదాల్లోకి లాగినట్టు అయ్యింది.
Read Also: Vizag Steel Plant: మోడీని టార్గెట్ చేసిన నారాయణమూర్తి.. విశాఖకు వస్తే..!
లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10లో మందు పార్టీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.. ఈ పార్టీలకు అధికార పార్టీకి చెందినవారు వెళ్లినట్టు నిర్ధారణకు వచ్చారు.. దీంతో ప్రధాని దంపతులతోపాటు దాదాపు 50 మందికి లేఖలు రాశారు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు.. ఇకి, ప్రధాని బోరిస్.. తన ప్రభుత్వం యొక్క స్వంత కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, చిక్కులు తప్పేలా లేవు.. ప్రధానమంత్రికి భారీగా జరిమానా విధించవచ్చు.. ఇప్పటికే బోరిస్‌పై కోపంతో ఉన్న సభలోని తోటి సభ్యులు.. ఈ వ్యవహారంతో మరింత ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది.. అతనిని బహిష్కరించాలంటూ సొంత పార్టీ ప్రజాప్రతినిధులు పిలుపునివ్వడం చర్చగా మారింది..
ఈ విషయంపై పలువురు మాజీ నేతలు ప్రధానిపై విమర్శలు గుప్పిస్తున్నారు.. కోవిడ్ నిబంధనలను ప్రధాని ఉల్లంఘిస్తే ఆయన జరిమానాను ఎదుర‍్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్‌పార్టీ మాజీ నేత ఐయాన్డంకన్స్మిత్మాట్లాడుతూ.. ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన పదవిలో కొనసాగడం కష్టమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కాగా, మొదటి లాక్‌డౌన్ సమయంలో మే 2020లో డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10లో పార్టీకి హాజరైనట్లు ఇప్పటికే ప్రధాని అంగీకరించాడు, అయితే, ఇది ఒక పనికోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా చెప్పుకొచ్చారు.. ఇక, ఆయన అధికారిక డౌనింగ్ స్ట్రీట్ నివాసంలో తన భార్య క్యారీ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా హాజరయ్యాడు, ఆ సమయంలో అక్కడ పాటలు వినిపించాయి. విచారణలో ఉన్న తేదీల్లో వారి కార్యకలాపాలకు లెక్కలు చెప్పాల్సిందిగా ప్రధానమంత్రి మరియు ఆయన భార్యతో సహా దాదాపు 50 మంది వ్యక్తులకు పోలీసులు లేఖ రాసి.. వివరాలు తీసుకుంటున్నారు.
