NTV Telugu Site icon

British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్‌లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో నిలిచిన విమానాలు..

British Airways

British Airways

British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్ (BA) ఐటీ వైఫల్యాన్ని ఎదుర్కొంది. శుక్రవారం వరసగా రెండో రోజు డజన్ల కొద్దీ విమానాలను రద్దు చేసింది. ‘‘సాంకేతిక సమస్య నాక్ ఆన్ ఎఫెక్ట్’’ కారణంగా శుక్రవారం 42 విమానాలు రద్దయ్యాయి. రద్దు కారణంగా 16,000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. గురువారం అత్యంత బిజీగా ఉంటే లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టు నుంచి 80 విమానాలు ఆలస్యం కావడం లేదా రద్దవ్వడం జరిగింది. విమానాల్లో ఎక్కువ భాగం నడుస్తున్నప్పటికీ.. నాక్-ఆన్ ఎఫెక్ట్ వల్ల స్వల్పదూరాల విమానాలను రద్దు చేస్తున్నట్లు బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

Read Also: UPSC Exam: సివిల్స్‌లో “ఇద్దరికి ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” కేసు.. క్రిమినల్ చర్యలకు సిద్ధం..

ప్రయాణికులకు వేరే విమానాల్లో రీబుకింగ్ చేయడం లేదా, డబ్బులను రీఫండ్ చేస్తున్నట్లు ఎయిర్ వేస్ తెలిపింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు విమాన స్టేటస్ తెలుసుకోవాలని కోరింది. గురువారం విమానాలను రద్దు చేసిన తర్వాత సదరు సంస్థ ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఈ వీకెండ్ లో యూకే విమానాశ్రయం నుంచి 11,300 కన్నా ఎక్కువ విమానాలు బయలుదేరాల్సి ఉందని, డేటా సంస్థ సిరియమ్ వెల్లడించింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ గతంలో కూడా ఐటీ ఫెయిల్యూర్ సమస్యను ఎదుర్కొంది. 2017లో వీకెండ్ సమయంలో 75,000 మంది ప్రయాణికులు ఇదే విధంగా ప్రభావితమయ్యారు. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ప్రయాణికులు యూరప్ వ్యాప్తంగా ప్రయాణించే క్రమంలో ఈ అవాంతరం ఎదురైంది. ఒక ఏడాది తర్వాత ఎయిర్ లైన్ బుకింగ్స్, ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇలాంటి సమయాల్లో నాక్ ఆన్ ఎఫెక్ట్ అనే టెక్నికల్ సమస్య ఏర్పడుతుంది.