ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ లేదు. అలాగని చేసుకోరని చెప్పలేము. కొన్ని కారణాల వలన విడిపోవచ్చు… తిరిగి కలుసుకోవచ్చు. ఎప్పుడో 2016లో యునితా రురీ అనే యువతిని అక్బర్ కొరిక్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఏమయిందో తెలియదు. ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయితే, అక్బర్ కొరిక్ కు ఇండోనేషియాలోని లాంబాక్ తెంగాకు చెందిన నూర్ ఖుస్నాల్ తో వివాహం నిశ్చయమైంది. ఈ విషయాన్ని కొరిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫ్రెండ్స్ అందరూ శుభాకాంక్షలు చెబుతూ లైక్ చేశారు. ఆ పోస్ట్‌ను మాజీ ప్రియురాలు రురీ కూడా చూసింది.
Read: మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ చేతులు మారుతోందా!?
కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మోరారిక్ సంప్రదాయంలో కొరిక్, నూర్ వివాహం జరిగింది. ఆ తరువాత కొరిక్… నూర్‌ను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొరిక్ ఇంటి దగ్గర రురీ దర్శనం ఇచ్చింది. మాజీ ప్రియురాలిని చూసి కొరిక్ షాక్ అయ్యాడు. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిందేమో అనుకున్నాడు. కానీ, పెళ్లి చేసుకోమని అడగానికి వచ్చిందని తెలిసి షాక్ అయ్యాడు. అటు వధువు కూడా షాక్ అయింది. కాసేపు ఆలోచించిన కొరిక్ మాజీ ప్రియురాలిని కూడా వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. వధువు, వరుడు తరపు బంధువులను ఈ వివాహానికి ఒప్పించి ఇద్దర్నీ పెళ్లిచేసుకున్నాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
