మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ చేతులు మారుతోందా!?

బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో, సొంత బ్యానర్ లో ‘ఆదిత్య 369’కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ మూవీ ఉంటుందని ఇంతవరకూ వార్తలు వచ్చాయి. బాలకృష్ణ సైతం ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని, ఆ సినిమాలో తాను కూడా నటిస్తానని చెప్పారు. కానీ ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అది కాకపోవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తోంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

Read Also : ఆదివారం డ్రామా జూనియర్స్ షోలో ఆమని హంగామా!

మొదటి నుండి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అంటే బాలకృష్ణకు ప్రత్యేక అభిమానం ఉంది. అందుకే ఆ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రాన్ని వీక్షించి, దర్శకుడు బుచ్చిబాబు సానాను బాలయ్యబాబు అభినందించారు. బాలకృష్ణ తమపై చూపుతున్న అభిమానంతో ఆయన కుమారుడు మోక్షజ్ఞను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసే అవకాశం ఇవ్వమని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, రవిశంకర్ కోరుతున్నారట. మోక్షజ్ఞ కోసం ఓ మంచి కథను తయారు చేయమని ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుకూ చెప్పారట. ప్రస్తుతం బుచ్చిబాబు అదే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. తాను హీరోగా గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమా పూర్తయ్యే సమయానికి బాలకృష్ణ ఏదో ఒక ఫైనల్ డెసిషన్ కు వస్తారని అనుకుంటున్నారు. ఆ రకంగా మోక్షజ్ఞ తొలిచిత్రం మైత్రీ మూవీ మేకర్స్ లోనే వచ్చే యేడాది పట్టా లెక్కవచ్చనే ఊహాగానాలు ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతున్నాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-