Site icon NTV Telugu

Boris Johnson : అవిశ్వాసంలో సత్తా చాటిన బోరిస్‌

Boris

Boris

అవిశ్వాస తీర్మానంలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సత్తా చాటారు. పార్టీ గేట్ వ్యవ‌హారంపై బోరిస్‌ జాన్సన్‌పై విమ‌ర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బోరిస్‌పై సొంత పార్టీ స‌భ్యులే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిగా.. తీర్మానానికి మ‌ద్దతుగా 148 మంది స‌భ్యులు ఓటు వేయగా.. బోరిస్‌కు మ‌ద్ద‌తుగా క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి చెందిన 211 స‌భ్యులు ఓటు వేశారు. అవిశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన అనంత‌రం బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. 59 శాతం మంది స‌భ్యులు త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

ఈ విజ‌యం త‌న‌కు శుభ ప‌రిణామమని పేర్కొన్న బోరిస్ జాన్సన్.. ఇది చాలా సానుకూల, నిర్ణ‌యాత్మ‌క‌మైన ఫ‌లితం అని తాను భావిస్తున్న‌ట్లు వెల్లడించారు. ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారిస్తామ‌న్నారు. 2019లో బోరిస్ జాన్స‌న్ భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే కోవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జ‌రిగాయి. అయితే కోవిడ్ నియ‌మావ‌ళిని ఉల్లంఘించి ఆ పార్టీల‌కు ప్ర‌ధాని బోరిస్ హాజ‌రైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించాయి.

Exit mobile version