పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.. పాకిస్థాన్‌లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు ఏకంగా 30 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు.. వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కోచా రిసల్దార్ ప్రాంతంలో జరిగిన పేలుడులో కనీసం 30 మంది మరణించారని.. వంద మందికి పైగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.. పెషావర్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.. మేం అత్యవసర స్థితిలో ఉన్నాము మరియు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నామని.. మరోవైపు, పేలుడు యొక్క స్వభావాన్ని పరిశీలిస్తున్నామని.. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా అనిపిస్తోందని పోలీసు అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ వెల్లడించారు.. పేలుడు సంభవించిన మసీదు.. పరిసర ప్రాంతాల్లో అనేక మార్కెట్లు ఉన్నాయని.. సాధారణంగా శుక్రవారం ప్రార్థనల సమయంలో రద్దీగా కూడా ఉండడంతో.. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, పేలుడుకు ముందు కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారని స్థానిక పత్రిక పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Bomb Blast: పాక్‌లో బాంబు పేలుడు.. 30 మంది మృతి
