Site icon NTV Telugu

Flight Crash: కుప్పకూలిన విమానం.. 133 మంది మృతి

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్‌ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. కన్ మింగ్ నుంచి వెళ్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలో విమానం క్రాష్ ల్యాండ్ అయి ప్రమాదం జరిగింది. పర్వతాలలో మంటలు చెలరేగాయని సీసీటీవీ ఫుటేజ్ తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లను ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు.

కాగా షాంఘైకి చెందిన చైనా ఈస్టర్న్ కంపెనీ చైనాలోని మూడు అగ్ర విమానయాన సంస్థలలో ఒకటి. ప్రమాదానికి గురైన విమానాన్ని 2015లో బోయింగ్ సంస్థ చైనా ఈస్టర్న్ కంపెనీకి డెలివరీ చేసింది. ఈ విమానం ఆరేళ్లుగా సేవలు అందిస్తోంది. ఇందులో రెండు ఇంజిన్‌లు ఉంటాయి. బోయింగ్ 737 ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన విమానాలలో ఒకటి. చైనా ఈస్టర్న్ కంపెనీ 737-800, 737 మాక్స్‌తో సహా సాధారణ విమాన సేవలను సైతం అందిస్తోంది.

https://ntvtelugu.com/ukraine-president-zelensky-warns-of-3rd-world-war-if-russia-talks-fail/
Exit mobile version