Site icon NTV Telugu

Russia-Ukraine war: రష్యా భీకర పోరు.. మృతదేహాల గుట్టలు..!

Russia Ukraine War

Russia Ukraine War

ఉక్రెయిన్‌పై రష్యా… 70 రోజులకుపైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. సైనిక చర్య పేరుతో దండయాత్ర మొదలుపెట్టిన క్రెమ్లిన్‌… ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో… భవనాలు నేలమట్టమవుతున్నాయి. వాటి కింద ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల్లో ఒకటైన ఖర్కివ్‌లో రెండు నెలల క్రితం రష్యా ఓ భవనంపై బాంబులు వేసింది. శిథిలాల తొలగిస్తున్న ఉక్రెయిన్‌ సైన్యం…44 మృతదేహాలను ఆలస్యంగా గుర్తించింది.

Read Also: Mahmood Ali : 3 నెలల్లో అందుబాటులోకి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

ఖర్కీవ్‌లో ఓ ఐదంతస్తుల భవనం… రష్యా బాంబు దాడులకు నేలమట్టం అయింది. ఆ సమయంలో భవనంలో… దాదాపు 50 మంది పౌరులు ఉన్నారు. మార్చి తొలి వారంలో ఈ ఘటన జరగ్గా.. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ భవన శిథిలాల కింద 44 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. ఉక్రెయిన్‌ పౌరులపై రష్యా సేనలు పాల్పడిన మరో భయానక యుద్ధ నేరంగా దీన్ని చెబుతున్నారు. రష్యా భీకర యుద్ధంలో… సాధారణ పౌరులు పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ దాడుల్లో ఖర్కివ్‌, మెరియుపోల్‌ భారీగా నష్టపోయాయి. ఇటీవల లుహాన్స్క్‌ ప్రాంతంలో… ఓ పాఠశాల షెల్టర్‌ భవనంపై బాంబు దాడి చేయగా.. 60 మంది మరణించారు. అంతకుముందు మెరియుపోల్‌లోని ఓ థియేటర్‌పై రష్యా బాంబులు జారవిడిచింది. ఆ సమయంలో థియేటర్‌లో వెయ్యి మందికి పైగా ఉన్నారు.

Exit mobile version