NTV Telugu Site icon

ఆఫ్ఘన్‌లో మరో పేలుడు.. 16 మంది మృతి..

ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాంద‌హార్‌లో బాంబు పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది. మసీదులో ప్రార్థన‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ పేలుళ్లు జరిగాయి.. ఈ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.. కాందహార్‌లో నడిబొడ్డున్న ఉన్న మసీదులో ఈ పేలుడు సంభవించింది.. షియా వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ ఈ పేలుడు జరిగింది.. 16 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 32 మంది గాయాలపాలయ్యారు.. క్షతగాత్రులను సమీపంలోని మిర్వాయిస్ ఆసుపత్రికి తరలించారు. పేలుళ్లు ఎవరి పని అనేది ఇంకా తెలియలేదు.. కానీ.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌.. షియా వర్గంపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారం తర్వాత ఈ పేలుడు జరగడంతో.. ఇది కూడా వారి పనేనా అనే అనుమానాలున్నాయి.