Blast At Busy Street In Turkey’s Istanbul: టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. బిజీగా ఉంగే ఓ స్ట్రీట్ లో శక్తివంతమైన పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇస్తిక్లాల్ స్ట్రీట్ లో జరిగిన ఈ పేలుడులో నలుగురు మరణించారు. 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు సంబంధించి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు, 38 మంది గయపడినట్లు ఇస్లాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయ ట్విట్టర్ లో తెలిపారు.
Read Also: Mohammed Shami: “దీన్నే కర్మ అంటారు”.. షోయబ్ అక్తర్‌పై షమీ ట్వీట్ వైరల్
ప్రసిద్ధ ఇస్తిక్లాల్ షాపింగ్ స్ట్రీట్ సాయంత్రం 4 గంటలకు బిజీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ స్ట్రీట్ మొత్తం షాపులు, రెస్టారెంట్లతో నిండి ఉంటుంది. పర్యాటకులతో పాటు స్థానికులతో సాధారణంగా ఈ స్ట్రీట్ రద్దీగా ఉంటుంది. ఘటన జరిగిన తర్వాత భద్రతబలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంలో సేవలు అందిస్తున్నాయి. ఈ పేలుడు తర్వాత టర్కీ ప్రభుత్వం దాడికి సంబంధించిన ఘటనపై మీడియా కవరేజీని నిషేధించింది. గతంలో 2015-16లో ఇస్తాంబుల్ లక్ష్యంగా ఐఎస్ఐఎస్ దాడులు చేసింది. ప్రస్తుతం దాడి ఘటనకు ఏ గ్రూపు కూడా బాధ్యత ప్రకటించుకోలేదు.
❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr
— NonMua (@NonMyaan) November 13, 2022
