NTV Telugu Site icon

Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ‘‘మహమ్మారి’’ ఇదేనా..?

Global Pandemic

Global Pandemic

Global Pandemic: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందన్ని ప్రపంచ మానవాళి ఎప్పుడూ ఊహించని విధంగా 2019 నుంచి రెండేళ్ల పాటు ప్రపంచదేశాలు ‘‘లాక్‌డౌన్’’లోకి వెళ్లాయి. లక్షల మంది చనిపోయారు. కోట్లలో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ఇప్పటికీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది.

కరోనా తర్వాత తదుపరి మహమ్మారి వస్తుందా..? అనే ప్రశ్న శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజల్ని కూడా తొలిచివేస్తోంది. అయితే, ‘‘బర్డ్ ఫ్లూ’’ తదుపరి ప్రపంచ మహమ్మారి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ యునైటెడ్ స్టేట్స్‌లోని జంతువులలో వేగంగా వ్యాపిస్తున్నందున, ఇది మానవుడి నుంచి మానవుడకి సంక్రమించే అవకాశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొత్త పరిశోధనల ప్రకారం.. బర్డ్ ఫ్లూ వైరస్‌లో మనుషుల మధ్య సంక్రమించేందుకు ఒకే మ్యుటేషన్ అవసరం కావచ్చని అంచనా వేస్తున్నారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యంపై నీలినీడలు.. ఇండియా కూటమిలో మమతకు మద్దతు…

H5N1 అనేది అత్యంత ప్రాణాంతకమైన వైరస్, ఇది సోకిన వారిలో 50% మందిని చంపుతుంది. వైరస్‌ను నియంత్రించడానికి, దాని మ్యుటేషన్‌ను ఆపడానికి మరియు ప్రజలకు నేరుగా సోకకుండా నిరోధించడానికి, జంతువుల ఇన్‌ఫెక్షన్లను నిశితంగా పర్యవేక్షించడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా బర్డ్ ఫ్లూ మానవుడిలో ముప్పుగా మారడానికి అనేక మ్యుటేషన్లు అవసరం. అయితే, కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని శాస్త్రవేత్తల ప్రకారం.. వైరస్ వేగంగా పరివర్తన చెందుతోందని సూచిస్తున్నారు. ఇది గ్లోబల్ పాండమిక్‌గా మారే సంభావ్యత ఉందని చెబుతున్నారు. స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ప్రకారం, ప్రస్తుతం, వ్యక్తుల మధ్య H5N1 సంక్రమించే కేసులేవీ లేవు. మానవుడిలో బర్డ్ ఫ్లూ కేసులు కలుషితమైన పరిసరాలు, వ్యాధి సోకిన ఫౌల్ట్రీ, పక్షలు, ఆవులతో సన్నిహితంగా ఉండటం వంటి వాటితో ముడిపడి ఉన్నాయి.

ఫ్లూ వైరస్ వ్యాధి సోకిన జంతువుల్లో హేమాగ్గ్లుటినిన్ అనే ప్రోటీన్ ద్వారా చేరుతాయి. ఇది హెస్ట్ కణాల ఉపరితలాలపై ఉండే గ్లైకాన్ గ్రాహకాలతో బంధిస్తుంది. గ్లైకాన్ సెల్ ఉపరితల ప్రోటీన్‌లపై చక్కెర అణువుల గొలుసులు కొన్ని వైరస్‌లకు బైండింగ్ సైట్‌లుగా పనిచేస్తాయి. H5N1 వంటి ఏవియన్ (పక్షి) ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు ప్రధానంగా పక్షులలో (ఏవియన్-రకం గ్రాహకాలు) కనిపించే సియాలిక్ యాసిడ్-కలిగిన గ్లైకాన్ గ్రాహకాలతో అతిధేయలను సంక్రమిస్తాయి. వైరస్‌లు చాలా అరుదుగా మానవులకు అణుగుణంగా ఉంటాయి. అయితే , అవి మానవుడిలో కనిపించే సియలైటేలేడ్ గ్లైకాన్ రిసెప్టర్లను గుర్తించడానికి అభివృద్ధి చెందితే, మానవుల మధ్య వ్యాపించే సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.