Bill Gates: నేను చింతిస్తున్నా.. క్షమించండి.. ఎప్‌స్టీన్ ఫైల్‌పై బిల్ గేట్స్ పశ్చాత్తాపం
- ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్
- తీవ్ర దుమారం రేపిన బిల్ గేట్స్ వ్యవహారం
- రష్యన్ అమ్మాయిలు, వివాహితులతో అక్రమ సంబంధాలు
- తాజాగా ఎప్‌స్టీన్ ఫైల్‌పై బిల్ గేట్స్ పశ్చాత్తాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్ అమెరికాతో పాటు యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా న్యాయశాఖ గత వారం విడుదల చేసిన ఫైల్ తర్వాత బడా ప్రముఖుల బండారం వెలుగులోకి వచ్చింది. ఈ-మెయిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బిల్ క్లింటన్, బిల్‌గేట్స్ సహా పలువురి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలికలతో విచ్చలవిడిగా వ్యవహరించినట్లుగా వెల్లడయ్యాయి. దీంతో ప్రస్తుతం ఎప్‌స్టీన్ ఫైల్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
గత వారం యూఎస్ న్యాయ శాఖ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోని మరికొన్ని పత్రాలను విడుదల చేసింది. ఇందులో ప్రముఖ వ్యక్తులు-ఎప్‌స్టీన్‌తో జరిపిన ఈ-మెయిళ్లు ఉన్నాయి. ఇందులో తరుచుగా స్నేహాలు, అక్రమ ఆర్థిక లావాదేవీలు, ప్రైవేటు ఫొటోలు బహిర్గతం అయ్యాయి. పత్రాల్లో బిల్‌గేట్స్ వివాహేతర సంబంధాలు బయటపడ్డాయి. రష్యన్ అమ్మాయిలతో బిల్‌గేట్స్ సెక్స్ చేసినట్లుగా ఎప్‌స్టీన్ పేర్కొన్నాడు. బిల్‌గేట్స్ డ్రగ్స్ కూడా పొందినట్లుగా వెల్లడైంది. వివాహిత మహిళలతో కూడా బిల్‌గేట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లుగా తాజా ఫైల్ ద్వారా బహిర్గతమైంది.
తాజాగా ఈ వ్యవహారంపై బిల్‌గేట్స్ స్పందించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గడిపిన సమయంపై విచారం వ్యక్తం చేశారు. ‘‘నేను చింతిస్తు్న్నాను. క్షమించండి.’’ అని బిల్‌గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2011లో ఎప్‌స్టీన్‌ను కలిశానని.. మూడేళ్ల పాటు అతనితో అనేక విందుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ‘‘నేను అతనితో గడిపిన ప్రతి నిమిషం నేను చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను.’’ అని 9 న్యూస్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ పంపలేదు. ఆ ఈ-మెయిల్ తప్పు.’’ అని తోసిపుచ్చారు. ‘‘అతని ఆలోచన ఏమిటో నాకు తెలియదు. అతను ఏదో విధంగా నాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు?.’’ అని అనిపిస్తోందన్నారు.

ఇక ఇదే వ్యవహారంపై బిల్ గేట్స్ మాజీ మాజీ మిలిందా ఫ్రెంచ్ గేట్స్.. యూఎస్ నేషనల్ పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్య్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్‌స్టీన్ ఫైల్ కారణంగానే బిల్ గేట్స్ నుంచి విడిపోయినట్లు తెలిపారు. ఎప్‌స్టీన్ పత్రాలు బయటకు వచ్చినప్పుడల్లా వ్యక్తిగతంగా తనకు చాలా కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహం విషయంలో చాలా బాధాకరమైన సమయాలను గడిపినట్లుగా వాపోయారు. అయినా ఎప్‌స్టీన్ ఫైల్‌పై బిల్ గేట్సే స్పందించాలని.. ఆయన కోసమే స్పందించాలని.. తన కోసం కాదన్నారు. బిల్ గేట్స్-మిలిందా 2011లో విడాకులు తీసుకున్నారు. ఇక ఎప్‌స్టీన్ 2019లో జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..