Site icon NTV Telugu

Donald Trump: నన్ను హత్య చేసేందుకు ఇరాన్‌ ట్రై చేస్తోంది..

Thurmp

Thurmp

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడెట్ డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం వెల్లడించింది. ఈ విషయమై జాతీయ నిఘా వర్గాలు ట్రంప్‌ను హెచ్చరించినట్లు తెలిపింది. అమెరికాలో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్‌ ట్రై చేస్తోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ ఆఫీస్ హెచ్చరికలు జారీ చేసింది అని ట్రంప్‌ ప్రచార బృందం చెప్పుకొచ్చింది. గత కొన్ని నెలలుగా ఇరాన్‌ బెదిరింపులు బాగా పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు పేర్కొనింది. డొనాల్డ్ ట్రంప్‌ను రక్షించడంతో పాటు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ హెచ్చరికలపై ట్రంప్‌ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు.

Read Also: Devara : మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే

కాగా, నన్ను హత్య చేసేందుకు ఇరాన్‌ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది అని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా తెలిపారు. అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్‌ సర్వీసెస్‌కు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఈ విషయంలో కలిసిరావడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఓ మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం అంటే నిందితుడికి మరణమే అని డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు.

Exit mobile version