Site icon NTV Telugu

California Storm: తుఫాన్ బీభత్సం.. కాలిఫోర్నియా అతలాకుతలం.. 19 మంది మృతి

California Storm

California Storm

Biden Declares Disaster As New Storms Hit Flooded California 19 Died: తుఫాన్ కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియా అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల ధాటికి వరదలు ఉప్పొంగి, డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. ఈ దెబ్బకు అక్కడ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వేలాదిమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చూసి ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. వరదల దెబ్బకు చివరికి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. చాలాచోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. చాలాచోట్ల వివిధ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఆస్తినష్టం తీవ్రంగా చోటు చేసుకుంది. ఈ ప్రమాదాల కారణంగా 19 మంది చనిపోయారని కూడా వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సోమవారం సైతం తుఫాన్ ముప్పు ఉండటంతో.. ప్రజలందరూ అప్రమత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కేవలం తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

Rajamouli: మన సినిమా గురించి మాట్లాడిన అవతార్ డైరెక్టర్… అదిదా సర్ రేంజ్

మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని ఈ పరిస్థితిని భారీ విపత్తుగా అభివర్ణించారు. ఈ శీతాకాలపు తుఫాన్, వరదలు, కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జో బైడెన్ ప్రకటించిన డిక్లరేషన్‌లో భాగంగా.. బాధితులకు సమాఖ్య నిధులు, తాత్కాలిక గృహాలు అందజేయడం జరుగుతుంది. అటు.. గత మూడు వారాల్లో తుఫాను సంబంధిత కారణాలతో 19 మంది చనిపోగా.. కార్లు నీటమునగడం వల్ల, డ్రైవర్లు, చెట్లు కూలిపోయి మీద పడటంతో వ్యక్తులు, కొండచరియలు విరిగిపడి భార్యాభర్తలు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల నీటిస్థాయి గణనీయంగా పెరగడంతో.. ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ ఆపేశారు. మరికొన్ని చోట్ల వరదలు భారీగా పారుతుండటంతో.. ఆయా ప్రాంతాల నుంచి వెళ్లడానికి వీలు లేక, కొందరు జనాలు తమ స్వగృహాల్లోనే ఉండిపోయారు. ఆదివారం ఉదయం వరకు 1600 కన్నా ఎక్కువ గృహాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే ఉండిపోయాయి. ఒక రైతు మాట్లాడుతూ.. తమ ప్రాంతం చాలాకాలం నుంచి కరువులోనే ఉందని, ఇంత భారీ వర్షం తమకు అలవాటు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. వర్షం 5.0 నుండి 7.5 సెంటీమీటర్ల మేర కురిస్తే మాత్రం.. వరదలు మరింతగా రావొచ్చని ఎన్ఎస్‌డబ్ల్యూ పేర్కొంది. సియెర్రా నెవాడాలోని కొన్ని ప్రాంతాలలో మూడు నుండి ఆరు అడుగుల మంచు కురుస్తుంది.

Indigo Emergency Landing: విమానంలో విషాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా..

Exit mobile version