Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Begging After Leaving Thousands Of Crores Of Assets Real Beggar

Srilanka: వేల కోట్ల ఆస్తులు వదిలేసి భిక్షాటన.. రియల్ బిచ్చగాడు

Published Date :July 15, 2023 , 9:07 am
By Naga Maneendra
Srilanka:  వేల కోట్ల ఆస్తులు వదిలేసి భిక్షాటన.. రియల్ బిచ్చగాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Srilanka: తనకున్న వేల కోట్ల ఆస్తులు వదిలేశాడు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఇది సినిమా బిచ్చగాడు కథ కాదు.. రియల్ బిచ్చగాడు కథ. బిచ్చగాడు సినిమాలో తన తల్లి కోసం 40 రోజులపాటు ఓ శ్రీమంతుడు బిక్షగాడిగా మారిన కథను మనందరం చూసాం. కానీ నిజ జీవితంలో అలా జరగడం కుదరదు అని కొందరు కొట్టి పారేస్తూ ఉంటాము. కానీ ఈ వ్యక్తిని చూస్తే మాత్రం అంతకుమించి అని అనడం ఖాయం. 40 వేల కోట్ల ఆస్తులు వదిలి సన్యాసం స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. అజన్ సిరిపానో ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తాడు. 18 ఏళ్ల వయసులో తన 40,000 కోట్ల ఆస్తిని వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారి 20 ఏళ్లుగా అడవుల్లోనే జీవిస్తున్నాడు. గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని, సుఖాలను విడిచిపెట్టి సన్మార్గంలో నడిచేందుకు అడవులకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన తరహాలోనే బుద్ధుని అనుచరుడైన వెన్ అజన్ సిరిపానో అనే బిలియనీర్ తన కోట్ల సంపాదన కాదని బౌద్ధ మతం స్వీకరించి సన్యాసిగా జీవిస్తున్నాడు.

Read also:Telangana: బీసీ వృత్తిదారులకు లక్ష సాయం నేటి నుంచే..

శ్రీలంక తమిళ సంతతికి చెందిన టెలికాం వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ కుటుంబానికి చెందినవారు సిరిపన్యో. ఆనంద్ కృష్ణన్ మెగా బిలియన్ డాలర్ల టెలికాం సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారు. కృష్ణన్ సామ్రాజ్యంలో టెలికాం పరిశ్రమ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, శాటిలైట్ వ్యాపారం ఉన్నాయి. కృష్ణన్‌కు కనీసం 9 ప్రధాన కంపెనీల్లో వాటా ఉంది. కృష్ణన్ మలేషియాలో మూడవ అత్యంత సంపన్నుడు. ఆనంద్ కృష్ణన్ మ్యాక్సిస్ బెర్హాల్ కంపెనీ యజమాని. ఈ కంపెనీ 2006లో, Maxis 74 శాతం వాటాను కొనుగోలు చేసి మన దేశంలో నడుస్తున్న Aircel యాజమాన్యం సైతం సొంతం చేసుకుంది. అయితే ఇది అనేక వివాదాలకు దారి తీసి ఎయిర్‌సెల్ దివాలా తీసింది. ఆనంద కృష్ణన్, టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి, అతని ఆస్తుల విలువ రూ. 40,000 కోట్ల (5 బిలియన్ డాలర్ల ) కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. ఆనంద కృష్ణన్ బౌద్ధమతాన్ని నమ్మేవారు. అతని కుమారుడు సిరిపన్యో 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో సిరిపన్యో సరదా కోసం సన్యాసి జీవితాన్ని స్వీకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాత్కాలిక సన్యాసి అంటూ వెక్కిరించారు. కానీ సిరిపన్యో మాత్రం తండ్రికి కోట్లాది రూపాయల ఆస్తులున్నప్పటికీ.. సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. వెన్ అజన్ సిరిపన్యో రెండు దశాబ్దాలకు పైగా అడవులలో సన్యాసి జీవితాన్ని గడిపినట్లు చెబుతారు. అతను థాయ్‌లాండ్‌లోని డేటావో దమ్ మొనాస్టరీకి మఠాధిపతి కూడా. వెన్ అజన్ సిరిపన్యో తన తల్లి వైపు థాయ్ రాజకుటుంబానికి చెందినవాడని ప్రజలు నమ్ముతారు. వెన్ అజన్ సిరిపన్యో ప్రారంభ జీవితం అతని సన్యాస జీవితం కంటే తక్కువ ప్రసిద్ధి చెందింది. వారి విద్యాభ్యాసం గురించి సరైన సమాచారం లేదు. అతనికి బ్రిటన్‌లో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నట్లు సమాచారం. వారితోనే బాల్యం గడిచిందని మీడియా తెలిసింది. సిరిపన్యోకు 8 భాషల్లో ప్రావిణ్యం ఉంది. అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assets
  • begging
  • Real Beggar
  • Srilanka
  • Thousands Of Crores

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions