Site icon NTV Telugu

Kamala Harris: కమలాహారిస్‌కు మాజీ అధ్యక్షుడు ఒబామా మద్దతు

Kamalaharris

Kamalaharris

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్‌ రేసులోకి వచ్చారు. అనూహ్యంగా ఆమెకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇక ఆమె పేరు దాదాపు ఖరారైనట్లుగానే కనిపిస్తోంది. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా మద్దతు ప్రకటించారు. స్వయంగా కమలా హారిస్‌కు ఫోన్ చేసి సపోర్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మిచెల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా జీతం..

అనారోగ్య కారణాలతో బైడెన్ అమెరికా అధ్యక్ష బరి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలోకి కమలా హారిస్‌ రేసులోకి వచ్చారు. ఆమెకు డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా పార్టీలో కీలకంగా ఉన్నారు. కమలా హారిస్ ప్రకటించగానే ఆమె తరపున ఒబామా ప్రచారం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Bengaluru: హాస్టల్‌లో యువతి హత్య.. సీసీకెమెరాలో రికార్డ్

Exit mobile version