Site icon NTV Telugu

Swaminarayan Temple: కెనడాలో మరోసారి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు.. స్వామి నారాయణ్‌ ఆలయంపై దాడి..!

Canada

Canada

Swaminarayan Temple: మరోసారి కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎడ్మింటన్‌లోని బీఏపీఎస్‌ స్వామి నారాయణ్ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రాఫిటీ పెయింట్‌ వేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాసుకొచ్చారు. దీనిపై కెనడాలోని విశ్వహిందూ పరిషత్‌ తీవ్రంగా మండిపడింది. తీవ్రవాద భావజాలంతో కొందరు హద్దులు మీరుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని వీహెచ్పీ డిమాండ్‌ చేసింది. మన దేశంలో శాంతిని ప్రేమించే హిందూ సమాజంపై ద్వేషాన్ని చిమ్ముతున్న తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయం తీసుకోవాలని దేశంలోని అన్ని స్థాయిల ప్రభుత్వాలను కోరుతున్నామని విశ్వహింద్ పరిషత్ ఎక్స్‌ లో కోరింది.

Read Also: Telangana Assembly: ముగిసిన బీఏసీ సమావేశం.. 25 న బడ్జెట్.. 31 వరకు సభ..

అయితే, స్వామి నారాయణ్‌ టెంపుల్ విధ్వంసాన్ని ఎంపీ చంద్ర మౌర్య సైతం తీవ్రంగా ఖండించారు. ఎడ్మింటన్‌లో బీఏపీఎస్‌ స్వామి నారాయణ్‌ ఆలయంపై మరోసారి దాడి జరిగిందన్నారు. ఖలిస్థానీ వేర్పాటు వాదులు ఇలాంటి గ్రాఫిటీలు రాయడం ఇదే మొదటిసారి కాదు అని తేల్చి చెప్పారు. గత కొన్నేండ్లుగా గ్రేటర్ టొరంటో, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాలపై ద్వేషపూరిత గ్రాఫిటీలతో విధ్వంసాలకు దిగుతున్నారని గుర్తు చేశారు. కెనడాలోని హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు తరచూ జరుగడం దారుణమన్నాని ఎంపీ చంద్ర మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://twitter.com/AryaCanada/status/1815562942458544447

Exit mobile version