NTV Telugu Site icon

Sheikh Mujibur Rahman: బంగ్లాదేశ్ ప్రధాని తండ్రి షేక్ ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహం ధ్వంసం..!

Shaik Mamaboob

Shaik Mamaboob

Sheikh Mujibur Rahman: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, షేక్ హసీనా తండ్రి.. షేక్ ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. షేక్ హ‌సీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వేల సంఖ్యలో యువత రోడ్ల మీదకు వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢాకాలో ఉన్న ప్రధాని ప్యాలెస్‌లోకి ప్రవేశించడంతో పాటు అక్కడ ఉన్న వస్తువులను పూర్తిగా నాశనం చేశారు. అలాగే, ఢాకా వీధుల్లో జెండాల‌తో భారీగా ర్యాలీలు తీశారు. మ‌ధ్యాహ్నం షేక్ హ‌సీనా దేశం విడిచి వెళ్లపోయిన త‌ర్వాత‌.. షేక్ హ‌సీనా అధికార నివాసం గేట్లను కూల్చి వేసిన ఆందోళనకారులు.. ఢాకాలో ఉన్న ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహం దగ్గర జ‌నం భారీ సంఖ్యలో ప్రోటెస్ట్ చేశారు. సుమారు నాలుగు లక్షల మంది ఆందోళ‌న‌కారులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మిలిట‌రీ విమానంలో ఇండియాకు పారిపోయిన షేక్ హ‌సీనా.. తొలుత ఢిల్లీకి వ‌చ్చి అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.

Read Also: Devara Second Single: దేవర సెకండ్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా?

అయితే, బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్ర రూపం దాల్చింది. దీంతో వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసింది. ఆ తర్వాత ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్‌లో బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌లోని అగర్తకు చేరుకున్నట్లు త్రిపుర పోలీసులు నిర్థారించారు.