Bangladeshi Kid Playing Hide and Seek Reaches Malaysia: హైడ్ అండ్ సీక్ గేమ్.. ఓ పసివాడిని దేశం దాటించేసింది. తన స్నేహితులతో కలిసి ఆ ఆట ఆడుతూ అతడు ఓ కంటైనర్‌లో దాక్కోగా.. దాన్ని ఓడలో ఎక్కించడం, అది పరాయి దేశానికి వెళ్లడం జరిగింది. ఒక దేశంలో కంటైనర్‌లోనికి వెళ్లిన అతడు, కంటైనర్ తెరవగానే మరో దేశంలో తేలాడు. ఆ బాలుడ్ని చూసి తొలుత ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. చివరికి జరిగిన తప్పిదాన్ని గుర్తించి, అతడ్ని స్వదేశానికి చేర్చారు. దీంతో ఆ బాలుడి కథ సుఖాంతం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Myanmar Woman Molested: ఢిల్లీలో దారుణం.. మయన్మార్‌కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారం
బంగ్లాదేశ్‌కు చెందిన బాలుడు రతుల్ ఇస్లామ్ ఫహిమ్ ఒనే కుర్రాడు తన కుటుంబసభ్యులతో కలిసి ఒక పోర్టు ఏరియాలో ఉంటున్నాడు. జనవరి 11వ తేదీన అతడు తన ఫ్రెండ్స్‌తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆట ఆడాడు. ఈ ఆట ఆడుతున్న సమయంలో.. సమీపంలో ఉండే ఓ కంటైనర్‌లో దాక్కున్నాడు. ఆ వెంటనే పోర్టు సిబ్బంది దాన్ని తనిఖీ చేయకుండా.. ఓడలోకి ఎక్కించేసింది. అక్కడి నుంచి ఆ ఓడ ప్రయాణం సాగిస్తూ.. జనవరి 17వ తేదీన మలేషియాకు చేరుకుంది. ఆ కంటైనర్‌లో ఇరుక్కున్నప్పటి నుంచి ఆ కుర్రాడు శబ్దాలు చేస్తూ, గట్టిగా కేకలు పెట్టాడు కానీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఎవ్వరికీ అతని అరుపులు వినిపించలేదు. అయితే.. మలేషియాకు ఓడ చేరుకున్న తర్వాత ఓ ఉద్యోగి ఆ కంటైనర్‌లో నుంచి శబ్దాలు రావడం గమనించాడు. అప్పుడు వెంటనే అతడు తన సహచరులకు సమాచారం ఇచ్చాడు.
Greece Train Accident: గ్రీస్‌లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రైళ్లు.. 26 మంది మృతి
లోపల ఎవరున్నారోనన్న భయంతో.. ఆ ఓడ సిబ్బంది కంటైనర్‌ని తెరిచారు. అప్పుడు వాళ్లకు లోపల ఫహిమ్ కనిపించాడు. వారం రోజుల పాటు తిండి, నీరు లేక అతడు నీరసించిపోయాడు. ఈ పిల్లాడు సమాచారం తెలుసుకున్న అధికారులు.. పోర్టు వద్దకు వాలిపోయారు. అతనికి చికిత్స అందించారు. తొలుత మానవ అక్రమ రవాణా ముఠా ఆ పిల్లాడ్ని తీసుకొచ్చిందేమోనని అధికారులు అనుమానించారు. కానీ.. విచారణలో అందుకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. బాలుడు కోలుకున్నాక పొరపాటున ఎక్కానని చెప్పాడు. ఫైనల్‌గా బంగ్లాదేశ్ హై కమిషనర్‌తో మాట్లాడి, చిన్నారిని స్వదేశానికి పంపించారు. దేవుడి దయతో బాలుడు తన స్వదేశానికి క్షేమంగా చేరుకున్నాడని మలేసియా ఇంటీరియర్ మినిస్టర్ సైఫుద్దీన్ నసూషన్ ట్వీట్ చేశారు.
Rishabh Pant: జీవితం విలువ తెలిసింది.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా