Site icon NTV Telugu

Sheikh Hasina: షేక్‌ హసీనా కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్లాన్

Sheikhhasina

Sheikhhasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే షేక్ హసీనాను అప్పగించాలంటూ భారత్‌ను కోరింది. ఇక ఆమె పాస్ పోర్టులను కూడా బంగ్లాదేశ్ రద్దు చేసింది. కానీ భారత్ మాత్రం స్పందించలేదు. దీంతో తాజాగా అంతర్జాతీయ మద్దతు కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ సలహాదారు అసిఫ్‌ నజ్రుల్‌ మీడియాకు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు మాజీ మంత్రి కౌంటర్..

షేక్ హసీనా కోసం దౌత్య మార్గంలోనూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం.. భారత్‌తో చర్చలు జరిపింది. హసీనాను అప్పగించాలని లేఖ కూడా రాసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు బంగ్లాదేశ్‌ విదేశాంగశాఖ అవసరమైన చర్యలు చేపడుతుంది. హసీనాను రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు నజ్రుల్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Samyuktha Menon: క్రేజియస్ట్ హీరోయిన్ సంయుక్త మీనన్.. చేతిలో అన్ని సినిమాలున్నాయా?

Exit mobile version