Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..

  • మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాద శిక్షణ..
  • బంగ్లాదేశ్‌లో పట్టుబడిన ఉగ్ర సంస్థ..
Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద సంస్థ పట్టుబడింది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థపై ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ‘‘ఫతాహ్ కాంబాట్ సిస్టమ్(ఎఫ్‌సీఎస్)’’ పేరుతో ఈ సంస్థ పలువురికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తోంది. ఈ సంస్థ అధినేతతో పాటు ట్రైనర్లు, విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థ ఉగ్రవాద భావజాలాన్ని యువతలో వ్యాప్తి చేస్తుందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్‌నేషనల్ క్రైమ్ (CTTC) ఈ మొత్తం ఉగ్ర కుట్రను భగ్నం చేసింది.

ఈ ఉగ్ర సంస్థ చీఫ్ షా అమానత్ సబీర్ మొబైల్ ఫోన్‌లో లభించిన రెండు నిమిషాల వీడియలో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు, తీవ్రవాద నినాదాలు, పదునైన ఆయుధంతో బెదిరింపులు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో ఐసిస్ ప్రచార గీతాలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. 2024లో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి కారణమైన విద్యార్థి నేతల పార్టీ ‘‘నేషనల్ సిటిజన్స్ పార్టీ’’కి చెందిన జాయింట్ సెక్రటరీ అలా ఉల్లా షాను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న 19 ఏళ్ల తహసీన్ ఇస్లాం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంస్థ తనను ఇస్లామిక్ మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ సంస్థగా చెప్పుకుంటోంది. చేతితో పోరాటం చేయడం, ఆయుధాల నుంచి రక్షణ, టాక్టికల్ మూవ్‌మెంట్, సర్వైవల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని దీని అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.