NTV Telugu Site icon

Bangladesh New Govt: నోబెల్ అవార్డు గ్రహీత ముహమ్మద్ యూనస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం..

Bangladesh

Bangladesh

Bangladesh New Govt: బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా గెలిచారని అక్కడి ప్రజలు ఆరోపించారు. దీంతో పాటు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ సర్కార్ పతనానికి దారి తీసింది. దీంతో సోమవారం ప్రధాని పదవికి రాజనామా చేసిన హసీనా బంగ్లా నుంచి హెలికాప్టర్‌లో భారత్ కు పారిపోయింది.

Read Also: House Collapsed : కాశీ విశ్వనాథ దేవాలయం సమీపంలో కూలిన ఇళ్లు.. ఎనిమిది మంది సమాధి

కాగా, బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనుస్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. 1940 జూన్ 28న చిట్టగాంగ్‌లో యూనస్ జన్మించారు. ఆర్థికశాస్త్రంలో 2006లో నోబెల్ అవార్డును అందుకుని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలోపేతం చేశారు. మైక్రో క్రెడిట్, మైక్రో ఫైనాన్స్‌ రంగంపై గట్టి పట్టు సాధించారు. బ్యాంకింగ్ సేవలను గ్రామణీ ప్రాంతాలకు విస్తరింపజేయడంలో డాక్టర్ మహ్మద్ యూనస్ కీలకంగా పని చేశారు.

Read Also: Shad Nagar Cas: షాద్ నగర్ దళిత మహిళా కేసులో మరో ట్విస్ట్.. సునీత భర్త రౌడీషీటర్..?

అలాగే, 2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్.. 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ యూనస్ అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యకలాపాలను చేపట్టడానికి 2011లో యూనస్ సోషల్ బిజినెస్- గ్లోబల్ ఇనిషియేటివ్స్‌ అనే సంస్థను స్థాపించారు. 1969లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన యూనస్ డాక్టరేట్ అందుకున్నారు. వాండర్‌బిల్ట్ యూనివర్సిటీలో చదువుకోడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌ను సైతం పొందారు. విద్యాభ్యాసం ముగిసి తర్వాత మిడిల్ టేన్నెస్సీ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేశారు. అలాగే, చిట్టాగాంగ్ యూనివర్శిటీ ఎకనమిక్స్ హెడ్‌గా కూడా బాధ్యతులను నిర్వర్తించారు.

Show comments