NTV Telugu Site icon

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు.. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్

Bangladesh

Bangladesh

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్‌’ను చుట్టుముట్టారు. షేక్ హసీనాను ప్రధాన మంత్రిగా తొలగించాలనే డిమాండ్‌లో నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘం మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ దగ్గర ర్యాలీ నిర్వహించాయి. అధ్యక్షుడి రాజీనామాతో సహా తమ డిమాండ్లను స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రకటించింది.

Read Also: IND vs AUS Test Series: నితీశ్ రెడ్డికి జాక్‌పాట్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ!

ఇక, ఆందోళనకారులు రాత్రి ‘బంగా భబన్’ మార్చ్‌గా వెళ్లగా.. రంగంలోకి దిగిన సైన్యం బారికేడ్లతో నిరసనకారులను ఆపేందుకు ప్రయత్నించారు. అధ్యక్ష పదవికి మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బంగా భవన్‌ బయట ఆందోళనకారులు గుమిగూడారు. అయితే, అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి స్నేహితుడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన వెంటనే రాజీనామా చేయాలని కోరారు. అలాగే, 1972 రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అలాగే, షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని విద్యార్థి సంఘం నేతలు కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు జూలై-ఆగస్టు చేసిన తిరుగుబాటు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్‌గా ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాకు 16వ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. అవామీ లీగ్ పార్టీ.. నామినేట్ చేయగా 2023 అధ్యక్ష ఎన్నికలలో షహబుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.