Bangladesh: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్మన్ తారిక్ రెహమాన్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఢాకాకు 200 కిమీ దూరంలో ఉన్న సిల్హెట్ లోని అలియా మాదర్సా మైదానంలో ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 12 ఎన్నికల కోసం బీఎన్‌పీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ఫ్రంట్ రన్నర్‌గా తారిక్ రెహమాన్ ఉన్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన తారిఖ్, తన తల్లి మరణంతో బీఎన్పీ బాధ్యతలు తీసుకున్నారు. గత నెలలో ఖలీదా మరణించారు. యూకేలో 17 ఏళ్లు ప్రవాస జీవితం గడిపిన తారిఖ్ గత నెలలో బంగ్లాదేశ్ వచ్చారు.
Read Also: Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించి చివరికీ..
బంగ్లాదేశ్ తిరిగి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో నిరుద్యోగం, రైతుల సమస్యల్ని ప్రస్తావించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ, పరోక్షంగా భారత్‌ను ప్రస్తావిస్తూ.. హసీనా ఇతర దేశాలకు లొంగిపోయారని అన్నారు. ‘‘ఢిల్లీ వద్దు, రావల్పింది వద్దు.. బంగ్లాదేశ్ ఫస్ట్’’ అనే నినాదాన్ని చేశారు. 1971లో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన జమాతే ఇస్లామీ పార్టీని కూడా విమర్శించారు.
బంగ్లాలో 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. బీఎన్పీతో పాటు జమాతే ఇస్లామీ కూడా ప్రధాన పార్టీగా పోటీలో ఉంది. జమాత్ అధినేత షఫీకుర్ రెహమాన్ నియోజకవర్గమైన ఢాకా-15 పరిధిలోకి వచ్చే మీర్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు. జమాత్ నాయకుడు షఫీకుర్ రెహమాన్ మరియు 10 పార్టీల కూటమి నాయకులు ఈ ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ఓటేయడంతో పాటు సంస్కరణల పేరుతో జాతీయ చార్టర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ చార్టర్‌పై గత ఏడాది దేశంలో 52 పార్టీల్లో 25 పార్టీలు సంతకాలు చేశాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ దీనిని వ్యతిరేకించింది. చార్టర్‌లో భాగంగా ప్రధానితో సమానంగా అధ్యక్షుడికి కూడా బాధ్యతలు ఇవ్వడం అఅనేది ఉంది.
