NTV Telugu Site icon

Bangladesh Durga Puja: బంగ్లాదేశ్లో దుర్గాపూజ వేడుకల్లో హింస.. పెట్రోల్ బాంబులతో దాడి

Ban

Ban

Bangladesh Durga Puja: బంగ్లాదేశ్‌లో హిందువులు దుర్గా పూజలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే, ఢాకాలోని ఒక ప్రాంతంలో తాటి బజార్ ప్రాంతంలో జరుగుతున్న దుర్గా పూజలో హింసాత్మక ఘటన చెలరేగింది. దుర్గాపూజ మండపం పైకి కొంత మంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.. దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియోలో గాయపడిన ఒక వ్యక్తిని హస్పటల్ కి తరలించడాన్ని మనం చూడొచ్చు.

Read Also: Vishwambhara: నేడే చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ టీజర్

ఇక, బంగ్లాదేశ్‌లోని హిందువులను అవమానించే ఘటనలు ఈ మధ్యలో బాగా జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లోని దుర్గా పూజ మండపంలోకి ‍ప్రవేశించిన కొందరు మరో మతానికి చెందిన సాంగ్స్ పాడారు. అలాగే, స్థానిక మీడియా కథనాల ప్రకారం చిట్టగాంగ్‌లోని జేఎం సేన్ హాల్‌లో ఒక టీమ్ దుర్గా పాటలను పాడేందుకు పూజా కమిటీ సభ్యులు పర్మిషన్ ఇచ్చారు. అయితే, అవి వేరే వర్గానికి చెందిన పాటలని.. స్థానిక హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఘటనపై స్థానిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.