NTV Telugu Site icon

Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!

Bangladesh

Bangladesh

Bangladesh Protests: రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అట్టుడుకుతుంది. స్టూడెంట్స్, నిరుద్యోగుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా సర్కార్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు ఫెయిల్ కావడంతో రంగంలోకి మిలటరీని దించింది. కాగా, ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 105 మంది చనిపోగా.. దాదాపు 2500 మంది గాయపడ్డారు. ఒక్క రాజధానిలో 52 మంది మృతి చెందాగా.. ఎక్కువ మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

Read Also: Poha Health Benefits: అటుకులు తినడం వల్ల ఇన్ని లాభాలా..

ఇక, దేశ రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమికూడొద్దన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ సందర్భంగా ఇంటర్నెట్‌ను ఆపేసింది. ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని స్టూడెంట్స్ వెల్లడించారు. ఈ అల్లర్లలో చోటు చేసుకున్న మరణాలకు ప్రధాన మంత్రి షేక్ హసీనానే కారణం.. వెంటనే ఆమె తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు నర్సింగ్డి జిల్లాలో నిరసనకారులు జైలులోకి దూసుకెళ్లి ఖైదీలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత జైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో జైలు నుంచి వందలాది మంది ఖైదీలు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. స్టూడెంట్స్ ఆందోళనకారులపై దాడులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.. ఇది ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు.

Read Also: Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు

కాగా, స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్‌తో 1971లో జరిగిన విముక్తి పోరులో పాల్గొన్న వారి పిల్లలు సహా కొన్ని నిర్దిష్ఠ సమూహాలకు సగానికిపైగా సివిల్ సర్వీస్ పోస్టుల్లో రిజర్వ్ చేసిన కోటా వ్యవస్థకు స్వస్తి పలకాలంటూ ఈ నెలలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రధాన మంత్రి హసీనాకు సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారన్న పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి.